ePaper
More
    HomeజాతీయంToll Tax Rules | బైక్‌ల‌కూ ఇక టోల్ బాదుడే.. జూలై 15 నుంచి డ‌బ్బు...

    Toll Tax Rules | బైక్‌ల‌కూ ఇక టోల్ బాదుడే.. జూలై 15 నుంచి డ‌బ్బు చెల్లించాల్సిందే..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Toll Tax Rules | ఇన్నాళ్లూ టోల్ ఫీజులు చెల్లించ‌కుండా తిరిగిన ద్విచ‌క్ర వాహ‌నాల‌పై ఇక నుంచి భారం ప‌డ‌నుంది. ఇప్ప‌టిదాకా అందుబాటులో ఉన్న ఫ్రీ స‌ర్వీస్ త్వ‌ర‌లోనే నిలిచి పోనుంది. టోల్ ప్లాజాలు(Toll plazas) దాటాలంటే త‌ప్ప‌నిస‌రిగా ఫీజు చెల్లించాల్సిందే. ఫాస్టాగ్ ఉచిత పాస్ గ‌డువు జూలై 15 నుంచి ముగియ‌నుంది. అప్ప‌టి నుంచి దేశంలోని అన్ని టోల్ ప్లాజాల్లో ద్విచ‌క్ర వాహ‌నదారులు డ‌బ్బులు క‌ట్టాల్సి ఉంటుంది.

    Toll Tax Rules | భారీగా భారం.. స‌ర్కారుకు ఆదాయం..

    జాతీయ ర‌హ‌దారుల ప్రాధికార సంస్థ (ఎన్ హెచ్ఏఐ) తీసుకున్న తాజా నిర్ణ‌యం కోట్లాది మంది ద్విచ‌క్ర వాహ‌న‌దారుల‌పై పెను భారం మోప‌నుంది. ఇన్నాళ్లు ఫ్రీగా జాతీయ ర‌హ‌దారుల‌పై ప్ర‌యాణం చేసిన వారంతా ఇక నుంచి సేవ‌ల రుసుం చెల్లించాల్సిందే. ద్విచక్ర వాహనాలపై టోల్ ఛార్జీలు(Toll charges) విధించడం దేశవ్యాప్తంగా ప్రయాణికులకు అనేక ప్రభావాలను చూపుతుందని భావిస్తున్నారు. స్వల్ప-దూర ప్రయాణానికి బైక్‌లపై ఆధారపడే రోజువారీ ప్రయాణికుల జేబుల‌కు చిల్లు ప‌డుతుంది. పైగా టోల్ బాదుడు వ‌ల్ల యాజమాన్య ఖర్చు పెరిగేకొద్దీ ద్విచక్ర వాహనాల(Two-wheelers) అమ్మకాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.

    Toll Tax Rules | స‌దుపాయాల పేరిట బాదుడు..

    టోల్ వసూలును క్రమబద్ధీకరించడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం లక్ష్యమే ద్విచక్ర వాహనాలకు టోల్ చార్జీలను ప్రవేశపెడుతున్న‌ట్లు తెలిసింది. బైక్‌ల‌పై విధించే టోల్ ద్వారా వ‌చ్చే ఆదాయం మెరుగైన రహదారి నిర్వహణ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహ‌దం చేస్తుంద‌ని చెబుతున్నారు.

    Toll Tax Rules | ఫాస్టాగ్ కొనాల్సిందే..

    ఇన్నాళ్లు కార్లు, లారీలు, బ‌స్సులు వంటి వాహ‌నాల‌కు మాత్ర‌మే టోల్ ఫీజు(Toll fees) వ‌సూలు చేసేవారు. ఇక నుంచి ద్విచ‌క్ర వాహ‌నాల‌కు కూడా వ‌సూలు చేయ‌నున్నారు. ఇందుకోసం బైక్ య‌జ‌మానులు త‌ప్ప‌కుండా ఫాస్టాగ్ స్టిక్క‌ర్లు(Fastag stickers) కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ద్విచక్ర వాహనాల కోసం ఫాస్ట్‌ట్యాగ్ అమలులో హైవేలపై ఎలక్ట్రానిక్ టోల్(Electronic toll) వసూలు వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేయ‌నున్నారు.

    Latest articles

    Rajat Patidar | ర‌జ‌త్ చేసిన త‌ప్పిదం.. కిరాణ కొట్టు వ్య‌క్తికి విరాట్‌, డివిలియ‌ర్స్ నుండి ఫోన్ కాల్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Rajat Patidar | ఆర్‌సీబీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) కెప్టెన్ రజత్ పటీదార్ (RCB Captain...

    Weather Updates | నేడు రాష్ట్రానికి భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రవ్యాప్తంగా సోమవారం భారీ వర్షం (Heavy Rain) కురిసే అవకాశం...

    Tamil Nadu | హాస్ట‌ల్‌లో త‌న ల‌వ‌ర్‌కి పుట్టిన బిడ్డ‌.. సంచిలో తీసుకెళ్లి ఆసుప‌త్రిలో అప్ప‌గించిన ప్రియుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Tamil Nadu | తమిళనాడు రాజధాని చెన్నైలో (Chennai) ఓ యువకుడి ప్రవర్తన మొద‌ట మానవత్వానికి...

    NTR Says sorry to Revanth | రేవంత్ రెడ్డి పేరు మ‌రిచిపోయిన జూనియ‌ర్ ఎన్టీఆర్.. క్ష‌మాప‌ణ‌లు చెబుతూ వీడియో రిలీజ్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన తాజా చిత్రం వార్ 2 (War 2) రిలీజ్‌కి రెడీ...

    More like this