అక్షరటుడే, వెబ్‌డెస్క్: Tollywood | హైదరాబాద్లోని ఫిల్మ్ ఛాంబర్(Film Chamber)లో బుధవారం సాయంత్రం సినీ డిస్ట్రిబ్యూటర్లు(Cinema distributors) కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎగ్జిబిటర్ల సమస్యలపై డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు చర్చించనున్నారు. ప్రస్తుతం ఉన్న రెంటెడ్ విధానాన్ని తీసేసి షేరింగ్ విధానాన్ని అమలు చేయాలని ఎగ్జిబిటర్లు కోరుతున్నారు. ఇప్పుడొస్తున్న సినిమాలు మొదటి వారమే కలెక్షన్లు ఉంటున్నాయని, రెండో వారం కలెక్షన్లు ఉండడం లేదని చెబుతున్నారు. మొదటి వారం వచ్చే కలెక్షన్లలో రెంట్ విధానం కాకుండా షేర్ ఇవ్వమని కోరుతున్నారు.
ఇది వరకే జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్(Theatres Closed) చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇటీవల ఫిల్మ్ ఛాంబర్‌లో సమావేశమైన తెలంగాణ, ఆంధ్రా ఎగ్జిబిటర్లు రెంట్ విధానానికి వ్యతిరేకంగా థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించారు. అద్దె ప్రాతిపదికన సినిమాలను ప్రదర్శించలేమని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో డిస్ట్రిబ్యూటర్లు సమావేశం అయి వారి సమస్యలపై చర్చించనున్నారు.