ePaper
More
    HomeతెలంగాణCabinet Meeting | నేడు కేబినెట్ భేటీ.. రైతు భరోసా సహా కీలక నిర్ణయాలు!

    Cabinet Meeting | నేడు కేబినెట్ భేటీ.. రైతు భరోసా సహా కీలక నిర్ణయాలు!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Cabinet Meeting | తెలంగాణ మంత్రివర్గ సమావేశం గురువారం ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (Chief Minister Revanth Reddy) అధ్యక్షతన జరగనుంది. రాష్ట్ర సచివాలయంలో మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. రైతు భరోసా(Raithu Bharosa), బనకచర్ల ప్రాజెక్ట్ ​(Banakacharla Project), కాళేశ్వరంపై ఎన్డీఎస్​ఏ నివేదిక, ఉద్యోగుల సమస్యలపై మంత్రివర్గంలో చర్చించనున్నారు.

    Cabinet Meeting | అన్నదాతల నిరీక్షణ

    రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్​ ఒక విడత రైతు భరోసా జమ చేయలేదు. గత యాసంగి సీజన్​కు ఎకరాకు రూ.6 వేల చొప్పున జమ చేస్తామని ప్రకటించింది. కానీ అందరి రైతుల ఖాతాల్లో నగదు జమ కాలేదు. నాలుగు ఎకరాల్లోపు రైతులకు మాత్రమే రైతు భరోసా జమ అయింది. మిగతా వారికి జమ కాకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు వానాకాలం సాగు సీజన్​ ప్రారంభం అయినా.. యాసంగి పెట్టుబడి సాయం అందకపోవడంపై రైతులు (Farmers) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజా మంత్రివర్గ సమావేశంలో వానాకాలం రైతు భరోసా గురించి ప్రకటన చేస్తారని రైతులు ఆశిస్తున్నారు. ఈ సీజన్​లోనైనా సకాలంలో పెట్టుబడి సాయం అందించాలని కోరుతున్నారు. రైతు భరోసా ఆలస్యంగా జమ చేస్తుండటంతో పంట పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నట్లు వాపోతున్నారు.

    Cabinet Meeting | బనకచర్లపై ఎలా ముందుకు..

    ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం(Andhra Pradesh Government) బనకచర్ల ప్రాజెక్ట్​ నిర్మిస్తోంది. దీంతో గోదావరి జలాలను ఏపీ తరలించుకు పోతుందని బీఆర్​ఎస్(BRS)​ ఆరోపిస్తోంది. మన జలాలు ఎక్కువగా వినియోగిస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. వెంటనే ప్రాజెక్ట్​ నిర్మాణాన్ని అడ్డుకోవాలని బీఆర్​ఎస్​ నాయకులు డిమాండ్​ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్​పై సమావేశంలో చర్చించి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు సమాచారం.

    Cabinet Meeting | ఉద్యోగుల సమస్యలపై..

    రాష్ట్రంలో ఉద్యోగులు కొంతకాలంగా తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేస్తున్నారు. పెండింగ్​లో ఉన్న డీఏ(DA)లు విడుదల చేయాలని, పీఆర్సీ ప్రకటించాలని కోరుతున్నారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన మంత్రివర్గ ఉపసంఘంతో కలిసి ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం అయ్యారు. ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఉద్యోగులకు ఒక డీఏ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే.. త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు జరిపేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ ఎనికలు దృష్టిలో ఉంచుకుని పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...