HomeUncategorizedShubanshu Shukla | నేడు వ్యోమగామి శుభాంశు శుక్లా తిరుగు ప్రయాణం

Shubanshu Shukla | నేడు వ్యోమగామి శుభాంశు శుక్లా తిరుగు ప్రయాణం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shubanshu Shukla | భారత వ్యోమగామి శుభాంశు శుక్లా 18 రోజుల అంతరిక్ష యాత్ర(Space Travel) అనంతరం నింగిపైకి రానున్నారు. సోమవారం ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమి మీదకు తిరిగి రానున్నారు. జూన్​ 25న ఇస్రో, నాసా సంయుక్తంగా చేపట్టిన ఆక్సియం-4 మిషన్​లో భాగంగా భారత వైమానిక దళానికి చెందిన శుభాంశు శుక్లా(Shubhanshu Shukla) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్లిన విషయం తెలిసిందే.

Shubanshu Shukla | 18 రోజులు ప్రయోగాలు

గత నెల 25న ఫాల్కన్​ –9 రాకెట్ ద్వారా శుభాంశు శుక్లాతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు అంతరిక్షంలోకి దూసుకెళ్లారు. వారు 28 గంటలు ప్రయాణించిన తర్వాత 26న అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ శుభాంశు శుక్లా 18 రోజుల పాటు వివిధ అంశాలపై ప్రయోగాలు చేపట్టారు. ఈ మిషన్​కు కెప్టెన్​గా వ్యవహించిన ఆయన మంగళవారం తన టీమ్​తో కలిసి నేలపైకి రానున్నారు.

Shubanshu Shukla | అన్​డాకింగ్​..

యాక్సిమ్ -4 మిషన్ అన్ డాకింగ్(Axim-4 Mission Undocking) సోమవారం సాయంత్రం 4:35 గంటలకు ప్రారంభం కానుంది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు కాలిఫోర్నియా(California) తీరంలో వీరి డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ దిగనున్నట్లు సమాచారం. 18 రోజుల పాటు అంతరిక్షంలో వివిధ ప్రయోగాలు చేసిన నలుగురు వ్యోమగాములు భూమిపైకి రేపు చేరుకుంటారు. అనంతరం వారిని వారం రోజుల పాటు రిహాబిలిటేషన్ సెంటర్‌(Rehabilitation Center)లో ఉంచుతారు. అంతరిక్ష వాతావరణం నుంచి నేరుగా భూ వాతావరణంలోకి వస్తే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇక్కడి వాతావరణం అలవాటు అయ్యే వరకు వారిని రిహాబిలేషన్​ సెంటర్​లో ఉంచనున్నారు.