ePaper
More
    Homeక్రీడలుIPL 2025 | నేడు ఎలిమినేట‌ర్ మ్యాచ్.. పంజాబ్‌తో ఆడే జ‌ట్టు ఏది..!

    IPL 2025 | నేడు ఎలిమినేట‌ర్ మ్యాచ్.. పంజాబ్‌తో ఆడే జ‌ట్టు ఏది..!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IPL 2025 | ఐపీఎల్ 2025 సీజన్‌లో క్వాలిఫ‌య‌ర్ Qualifier 1మ్యాచ్ చాలా చ‌ప్ప‌గా సాగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్(Punjab) త‌క్కువ స్కోర్ చేయ‌గా, ఆర్సీబీ ఆ టార్గెట్‌ని సులువుగా చేధించింది.

    ఈ గెలుపుతో 9 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు అర్హత సాధించింది రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(Royal Challengers Bangalore). ఆర్‌సీబీ ఫైనల్ చేరడం ఇది నాలుగోసారి. గతంలో 2009, 2011, 2016లో ఫైనల్ చేరిన ఆర్‌సీబీ తృటిలో టైటిల్ చేజార్చుకుంది. పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) కనీస పోటీ ఇవ్వలేకపోయింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్.. తమ ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయలేకపోయామని చెప్పాడు. అయితే క్వాలిఫ‌య‌ర్‌లో ఓట‌మి చెందిన పంజాబ్ మ‌రో మ్యాచ్ ఆడ‌నుంది.

    Eliminator match : ట‌ఫ్ ఫైట్..

    ప్లేఆఫ్స్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ (Mumbai Indians – MI) కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans – GT)తో తలపడనుంది. అయితే, ఈ కీలక సమరానికి ముందు ముంబై జట్టులో కొన్ని ఆసక్తికరమైన మార్పులు చోటు చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. విధ్వంసకర ఆటగాళ్లు ర్యాన్ రికెల్టన్, విల్ జాక్స్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండరని, వారి స్థానంలో ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో (England star batsman Jonny Bairstow) ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేయనున్నాడని సమాచారం. జానీ బెయిర్‌స్టో వంటి అనుభవజ్ఞుడైన, ప్రపంచ స్థాయి ఆటగాడి రాకతో ఆ లోటు భర్తీ అవుతుందని జట్టు యాజమాన్యం భావిస్తోంది. బెయిర్‌స్టో ఓపెనర్‌గా లేదా మిడిల్ ఆర్డర్‌లో ఆడగల సమర్థుడు.

    వికెట్ కీపింగ్ బాధ్యతలను కూడా నిర్వర్తించగలడు. ఇది జట్టుకు అదనపు బలం చేకూరుస్తుంది. బెయిర్‌స్టో చేరికతో, ముంబై ఇండియన్స్ తమ బ్యాటింగ్ ఆర్డర్‌లో కొన్ని సర్దుబాట్లు చేయాల్సి ఉంటుంది. రోహిత్ శర్మతో Rohit Sharma కలిసి బెయిర్‌స్టో ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

    ముంబై ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో గెల‌వాల‌నే క‌సితో ఉండ‌గా, మ‌రోవైపు జీటీ కూడా ప‌క్కా ప్రణాళిక‌లు అమ‌లు చేస్తుంది. రెండు టీమ్‌ల మ‌ధ్య ట‌ఫ్ ఫైట్ ఉండ‌నుంద‌ని తెలుస్తుంది. ఈ రెండింట్లో గెలిచే టీమ్‌తో పంజాబ్ ఆడ‌నుంది. వారు ఫైన‌ల్‌లో ఆర్సీబీతో త‌ల‌ప‌డ‌నున్నారు. చూడాలి మ‌రి ఎలాంటి అద్భుతాలు జ‌రుగుతాయో..!

    Latest articles

    Indalwai | ఒకరి అతివేగం.. మరొకరి ప్రాణం తీసింది.. హైవేపై రెండు బైకులు ఢీకొని ఒకరి దుర్మరణం

    అక్షరటుడే ఇందల్వాయి: Indalwai | రెండు బైక్​లు ఢీకొని ఒకరు దుర్మరణం చెందిన ఘటన ఇందల్వాయి మండలం గన్నారం(gannaram)...

    Meenakshi Natarajan | పార్టీ కోసం పనిచేసినవారికి తగిన గుర్తింపు

    అక్షరటుడే, ఆర్మూర్‌ : Meenakshi Natarajan | పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని...

    Medical College | మెడికల్​ కళాశాలల అడ్మిషన్లలో స్థానికత జీవోను అమలు చేయాలి

    అక్షరటుడే, ఇందూరు: Medical College | మెడికల్ కళాశాలల అడ్మిషన్లలో స్థానికత కోసం తీసుకొచ్చిన జీవో నం.33ని అమలు...

    Earthquake in russia | రష్యాలో మళ్లీ భారీ భూకంపం.. బద్దలైన అగ్ని పర్వతం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Earthquake in russia | రష్యాలో వరుస భూకంపాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. బుధవారం...

    More like this