అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | పట్టణంలోని శ్రీ భగలాముఖి పీఠంలో అష్టమి సందర్భంగా మంగళవారం అమ్మవారి జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు పీఠాధిపతి క్రాంతి పటేల్ తెలిపారు. విశేష అభిషేకాలు, మధ్యాహ్నం భక్తులకు అన్నదానం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
