అక్షరటుడే, వెబ్‌డెస్క్: BRS Silver Jubilee Festival : వరంగల్ Warangal వేదికగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వాహనాల్లో వచ్చేవారికి పార్కింగ్ ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సభ రూట్ మ్యాప్‌ను కూడా విడుదల చేశారు.
మూడు జాతీయ రహదారులకు సభాస్థలి అందుబాటులో ఉంది. సభకు వచ్చేవారి ప్రాంతాలకు అనుగుణంగా 5 జోన్లుగా విభజించారు. వీటికి అనుగుణంగానే 5 మార్గాలు, 5 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. వాహనాలను పార్కింగ్ చేసిన దగ్గర నుంచి 200-300 మీటర్ల మేర కాలినడకతోనే సభ ప్రాంగణంలోకి వెళ్లాల్సి ఉంటుంది.
ఆయా ప్రాంతాల వారీగా వచ్చేవారు తమకు కేటాయించిన పార్కింగ్ స్థలంలోనే వాహనాలు పార్కు చేసి, కాలినడకన సభాస్థలికి చేరుకోవాల్సి ఉంటుంది.

BRS Silver Jubilee Festival | నేడే బీఆర్ఎస్ రజతోత్సవ పండుగ..సభ నిర్వహణకు భారీగా ఏర్పాట్లు..రూట్ మ్యాప్ ఇదిగో..
- జోన్ 1 – వర్ధన్నపేట, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, పరకాల, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, పాలకుర్తి, ములుగు, పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట, కొత్తగూడెం, ఇల్లందు.
- జోన్ 1 రూట్ – మల్లంపల్లి నుంచి వంగపహాడ్ దాటి NH 163లో U టర్న్ తీసుకుని హసన్‌పర్తి మీదుగా సభ పార్కింగ్ స్థలానికి చేరుకోవాలి.

BRS Silver Jubilee Festival | నేడే బీఆర్ఎస్ రజతోత్సవ పండుగ..సభ నిర్వహణకు భారీగా ఏర్పాట్లు..రూట్ మ్యాప్ ఇదిగో..
- జోన్ 2 – ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల నియోజకవర్గాలు &ఇల్లందు( కొంత భాగం), వైరా, ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి, మధిర.
- జోన్ 2 రూట్ – ఖమ్మం వారి కోసం మామునూరు నుంచి NH 163 టోల్‌గేట్ దాటి అనంతసాగర్ మీదుగా సభ పార్కింగ్ స్థలానికి రావాలి.
- వరంగల్ ఉమ్మడి జిల్లాల వారికి కరుణాపురం నుంచి NH 163 టోల్‌గేట్ దాటి సభ పార్కింగ్ స్థలానికి చేరుకోవాలి.

BRS Silver Jubilee Festival | నేడే బీఆర్ఎస్ రజతోత్సవ పండుగ..సభ నిర్వహణకు భారీగా ఏర్పాట్లు..రూట్ మ్యాప్ ఇదిగో..
- జోన్ 3 – జనగాం, స్టేషన్ ఘనపూర్
- జోన్ 3 రూట్ – ధర్మసాగర్ నుంచి సభ పార్కింగ్ స్థలానికి రావాలి.
- జోన్ 4 – ఉమ్మడి కరీంనగర్ జిల్లా నియోజకవర్గాలు, చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, పరకాల(కొంత భాగం).
- జోన్ 4 రూట్ – కరీంనగర్, హుజూరాబాద్ నుంచి గ్రానైట్ రోడ్డు మీదుగా పార్కింగ్ స్థలానికి చేరుకోవాలి.

BRS Silver Jubilee Festival | నేడే బీఆర్ఎస్ రజతోత్సవ పండుగ..సభ నిర్వహణకు భారీగా ఏర్పాట్లు..రూట్ మ్యాప్ ఇదిగో..
- జోన్ 5 – ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల నియోజకవర్గాలు, నిర్మల్, ఆదిలాబాద్, ఖానాపూర్, బోత్.
- జోన్ 5 రూట్ – సిద్దిపేట మీదుగా ముల్కనూర్ నుంచి ఇందిరానగర్ పార్కింగ్ స్థలానికి చేరుకో వాల్సి ఉంటుంది.