HomeతెలంగాణEx Mla Jeevan Reddy | చరిత్రలో ఈరోజు బ్లాక్​ డే..: మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి

Ex Mla Jeevan Reddy | చరిత్రలో ఈరోజు బ్లాక్​ డే..: మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్​: Ex Mla Jeevan Reddy | కేసీఆర్​ను విచారణకు పిలిచిన ఈరోజును బ్లాక్​డేగా మిగిలిపోతుందని మాజీ ఎమ్మెల్యే జీవన్​ రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. కాళేశ్వరం(Kaleshwaram) ప్రాజెక్ట్​లో చిన్నచిన్న సమస్యలను భూతద్దంలో చూసి పెద్దవిగా మార్చారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్​ అనేది మహా జలశక్తి పీఠమని అభివర్ణించారు.

ప్రాజెక్ట్​ ద్వారా లక్షలాది ఎకరాలకు నీరందుతోందన్నారు. ప్రాజెక్ట్​పై ఏమాత్రం అవగాహన లేని కాంగ్రెస్​ ప్రభుత్వం కమిషన్​ పేరుతో కేసీఆర్​ను ఇబ్బంది పెట్టాలని చూస్తే సహించేది లేదన్నారు. రేవంత్​ రెడ్డి (Revanth Reddy) కథ ఇక ముగిసిపోనుందన్నారు.