Homeతాజావార్తలుToday Horoscope | దీపావళి రోజు ఈ రాశుల వారి జీవితాల్లో తారాజువ్వలే..!

Today Horoscope | దీపావళి రోజు ఈ రాశుల వారి జీవితాల్లో తారాజువ్వలే..!

Today Horoscope | 12 రాశుల వారికి గ్రహ స్థానాలు నేడు అద్భుత ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ఈ రోజు కొందరికి ఉద్యోగంలో పైచేయి, మరికొందరికి ఒత్తిడి నుంచి విముక్తి, కుటుంబ బాధ్యతలు, అనవసరపు ఖర్చులు, ప్రేమ జీవితంలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకుంటాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Horoscope | 12 రాశుల వారికి గ్రహ స్థానాలు అక్టోబర్ 20 2025 నాడు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయో తెలుసుకుందాం.

ఈ రోజు కొందరికి ఉద్యోగంలో పైచేయి, మరికొందరికి ఒత్తిడి నుంచి విముక్తి, కుటుంబ బాధ్యతలు, అనవసరపు ఖర్చులు, ప్రేమ జీవితంలో ఆకస్మిక మార్పులు ఎదురవుతాయి.

మేషరాశి Aries: ఈ రోజు మేష రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. పిల్లల ప్రతిభ, వారి పనితీరు ఎంతో ఆనందాన్ని, సంతృప్తిని కలిగిస్తుంది. ఆర్థికపరంగా, ఈ రోజు తెలివిగా, దీర్ఘకాలిక ప్రణాళికతో కూడిన పెట్టుబడులు పెట్టడానికి మంచి సమయం.

భావోద్వేగ పరమైన విషయాలలో (ఎమోషనల్ రిస్క్) అనుకూల ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా, అంకితభావం, నిస్వార్థ ప్రేమకు ఈ రోజు అద్భుతాలు సృష్టించే శక్తి ఉంది.

వృత్తిపరంగా పనిపైన, ముఖ్యమైన అంశాలపైన దృష్టి కేంద్రీకరించడం మంచిది. వ్యక్తిగత జీవితంలో, వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా, సంతృప్తికరంగా ఉంటుందని చెప్పవచ్చు.

ఇవాళ మంచి ఫలితాల కోసం.. రాగి పాత్రలో బెల్లం, గోధుమలు, ఎరుపు పువ్వులను కలిపిన నీటిని సూర్య భగవానుడికి సమర్పించాలి.

వృషభ రాశి Taurus: ఇవాళ ఊహించని ధన లాభాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ బాధ్యతలను నిర్లక్ష్యం చేయొద్దు. ఇంట్లో కొంచెం ఇబ్బందికర వాతావరణం ఉండవచ్చు.

ప్రేమలో కొంచెం నిరాశ ఉన్నా, త్వరలో పరిస్థితి మారుతుంది. భాగస్వామ్య వ్యాపారాలకు దూరంగా ఉండండి. సాయంత్రం ఇష్టమైన అలవాట్లతో మానసిక ప్రశాంతత పొందుతారు. కుటుంబంలో శాంతి కోసం, శుభ సందర్భాల్లో తెల్లని వస్తువులను దానం చేయాలి.

మిథున రాశి Gemini: ఇవాళ సంతోషంగా, ఉల్లాసంగా ఉంటారు. కొత్త పథకాలపై పెట్టుబడి పెట్టే ముందు బాగా ఆలోచించాలి. ఇంట్లో గొడవలు, కలహాలు రావచ్చు. కోపాన్ని తగ్గించుకోవాలి.

సమస్యలకు త్వరగా పరిష్కారం చూపడం వలన గౌరవం పొందుతారు. భాగస్వామి నుంచి అద్భుతమైన కానుక లభిస్తుంది. ఇవాళ జీవితంలో క్రమశిక్షణ పాటిస్తే, కుటుంబంలో సంతోషం పెరుగుతుంది.

కర్కాటక రాశి Cancer: ఇవాళ మంచి పేరుపొందిన వ్యక్తుల నుంచి నైతిక ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబంతో కలిసి బయటకు వెళ్లి ఎక్కువగా ఖర్చు చేస్తారు. పిల్లలతో, చిన్నవారితో ఓర్పుగా వ్యవహరించడం మంచిది.

బాధించిన వారికి క్షమాపణ చెప్పండి. పాత తప్పులను సరిదిద్దుకోవాలి. జీవిత భాగస్వామి వలన గౌరవానికి భంగం కలిగే అవకాశం ఉంది. జీవితం మెరుగుపడాలంటే.. ముఖ్యంగా శుక్రవారాల్లో శ్రీ సూక్తం పారాయణం చేయండి.

సింహ రాశి Leo: ఇవాళ మీరు ఒత్తిడి (టెన్షన్) నుంచి బయటపడటానికి కుటుంబం మద్దతు తీసుకోవాలి. వారి సహాయాన్ని గౌరవంగా స్వీకరించండి. సమస్యలను పంచుకోవడం వలన మేలు జరుగుతుంది.

ఆధ్యాత్మిక కార్యక్రమాలకు డబ్బు ఖర్చు చేస్తారు. దీనివలన మానసిక తృప్తి లభిస్తుంది. ఇంట్లో వారితో కలిసి కొంచెం వేరుగా, సంతోషంగా ఉండేలా ఏదైనా కొత్త ప్రయత్నం చేయాలి. ఆఫీసులోని ప్రత్యర్థులు/శత్రువులు వారి తప్పుడు పనుల వల్ల ఈ రోజు ఫలితాన్ని అనుభవిస్తారు.

తీరిక లేకుండా గడిపిన వారికి ఇవాళ విశ్రాంతి దొరికి, ఆ సమయాన్ని ఆనందంగా గడుపుతారు. మంచి ఆరోగ్యం కోసం పరమశివుడిని పూజించండి.

కన్య రాశి Virgo: ఏదైనా కష్టమైన, బాధాకరమైన పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తే కుంగిపోకూడదు. కొన్ని సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మూడ్‌ను మార్చుకోవచ్చు.

అనవసరంగా ఖర్చు చేసేవారు ఈ రోజు నుంచి పొదుపు చేయడం ప్రారంభించాలి. మతపరమైన ప్రదేశాలకు వెళ్లడం, ఒక ఆధ్యాత్మిక వ్యక్తిని కలవడం ద్వారా మనసుకు శాంతి, ప్రశాంతత లభిస్తాయి.

ఆఫీసులో పని వాతావరణం చాలా మెరుగ్గా ఉంటుంది. భవిష్యత్తు కోసం మంచి ప్రణాళికలు రూపొందించుకుంటారు. అయితే, సాయంత్రం బంధువులు రావడం వలన ప్రణాళికలు వృథా అయ్యే అవకాశం ఉంది. అద్భుతమైన ఆరోగ్యాన్ని పొందాలంటే, భైరవ దేవుడిని పూజించండి.

తుల రాశి Libra: మానసిక ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఇది ఆధ్యాత్మికత సహాయం తీసుకోవాల్సిన సమయం. ధ్యానం, యోగా మానసిక దృఢత్వాన్ని పెంచుతాయి.

ఇవాళ పెట్టుబడులు పెట్టకుండా ఉండటం మంచిది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంతోషంగా సమయం గడుపుతారు. ప్రియమైన వారికి మధ్య మూడో వ్యక్తి జోక్యం వలన మరింత భిన్నాభిప్రాయాలు పెరగవచ్చు.

ఆఫీసులో ఈ రోజు ప్రతి విషయంలోనూ పైచేయి అవుతుంది. బయటకు వెళ్ళినప్పుడు గతంలో విభేదాలు వచ్చి విడిపోయిన వ్యక్తులు ఎదురుపడవచ్చు. మంచి ఆర్థిక జీవితం గడపాలంటే, ప్రవహించే నది ((లేదా శుభ్రమైన నీటి) లో పసుపును కలపండి.

వృశ్చిక రాశి Scorpio: భయం అనే పెద్ద సమస్యతో పోరాడుతున్నారు. ఆలోచనలను సానుకూలంగా మార్చుకోవాలి. లేకపోతే ఆ భయానికి లొంగిపోతారు. చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ రోజు అనుకూలంగా కలిసి వస్తుంది.

ఈ రోజు చేసే ప్రయాణాలు కేవలం మానసిక ఆందోళన, ఒత్తిడికి కారణమవుతాయి. కాబట్టి ప్రయాణాలు మానుకోవడం మంచిది.

ఇష్టమైన వారితో పిక్నిక్‌కు వెళ్లడం ద్వారా, పాత విలువైన క్షణాలను మళ్లీ ఆస్వాదిస్తారు. ఇతర దేశాలలో వృత్తిపరమైన సంబంధాలు నెలకొల్పడానికి ఇది చాలా మంచి సమయం. ఇవాళ ప్రాణాయామం (శారీరక మెళకువలు) వంటి వాటిని ఉదయం సాధన చేయండి.

ధనుస్సు రాశి Sagittarius: శారీరక ఆరోగ్యం కోసం పొగత్రాగడం తక్షణమే మానుకోండి. దగ్గరి బంధువుల సహాయంతో వ్యాపారం బాగా కలిసి వస్తుంది.

ఇది ఆర్థికంగా కూడా లాభాన్ని తెస్తుంది. ఆభరణాలు లేదా గృహోపకరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మోసపోకుండా ఉండేందుకు, వ్యాపారంలో అన్నీ మెలకువగా గమనిస్తూ ఉండాలి.

ఆటలు ముఖ్యం. కానీ అతిగా ఆడటం అనేది చదువుపై ప్రభావం చూపుతుంది. జీవిత భాగస్వామి ఈ రోజు మిత్రులతో బిజీగా ఉండి.. మిమ్మల్ని అప్‌సెట్ చేయవచ్చు. ప్రేమలో విజయం సాధించడానికి, గణేశ ఆలయం వద్ద నలుపు-తెలుపు రంగుల జెండాను ఎగురవేయండి.

మకర రాశి Capricorn: ఈ రోజు ఒత్తిడి (టెన్షన్) నుంచి బయటపడవచ్చు. అతిగా ఖర్చు చేయడం మానుకోండి. లేకపోతే, ఆర్థిక లక్ష్యాలకు దూరమయ్యే ప్రమాదం ఉంది.

భార్య ,పిల్లల నుంచి మరింత ఎక్కువ ప్రేమ, అభిమానం, శ్రద్ధ లభిస్తాయి. ఈ రోజు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేకపోవచ్చు. దీనివల్ల ప్రియమైనవారు కోపానికి గురవుతారు.

ప్రయాణం చేయడం వలన కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి. బిజీ జీవితాన్ని పక్కన పెట్టి, ఈ రోజు ఇష్టమైన పనుల కోసం తగినంత సమయాన్ని కేటాయిస్తారు. ఆర్థిక వనరులను పెంచుకోవడానికి, గణేష్ చాలీసా, శ్లోకాలను పఠించాలి.

కుంభ రాశి Aquarius: కుటుంబంతో సమయం గడపడం ద్వారా.. అందరికీ దూరంగా ఉన్నామనే ఒంటరి భావనను వదిలివేయాలి. మిమ్మల్ని తల్లిదండ్రులు ,స్నేహితులు సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. గ్రహాల ప్రభావం వల్ల ఈ రోజు ప్రేమ వ్యవహారాలలో కొంత నిరాశ ఉండవచ్చు.

వృత్తిపరంగా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. రోజు ప్రారంభం కొంచెం అలసటగా ఉన్నా.. రోజు గడిచేకొద్దీ మంచి ఫలితాలను పొందుతారు. ఆరోగ్యంగా ఉండాలంటే.. వెండి పాత్రలో నీరు త్రాగండి.

మీన రాశి Pisces: today Horoscope : ఇవాళ ఆత్మవిశ్వాసంతో పనులను సులువుగా పూర్తి చేసే ప్రణాళిక వలన విశ్రాంతి తీసుకోవడానికి సమయం దొరుకుతుంది.

ఉద్యోగస్తులు ఒక స్థిరమైన మొత్తాన్ని పొందాలని ఆశిస్తారు. కానీ, గతంలో పెట్టిన అనవసరపు ఖర్చుల కారణంగా అది అందకపోవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడుపుతూ రిలాక్స్ అవుతారు.

భాగస్వాములు (పార్ట్‌నర్‌లు) మీ ఆలోచనలకు, ప్రణాళికలకు పూర్తిగా మద్దతు ఇస్తారు. చుట్టూ ఉన్నవారికి మేలు చేసే ప్రాజెక్టులను అమలు చేయడంలో నిమగ్నమవుతారు. షాపింగ్, ఇతర కార్యకలాపాలతో రోజు చాలా బిజీగా ఉంటారు. ప్రయాణాలకు దూరంగా ఉండాలి.