అక్షరటుడే, వెబ్‌డెస్క్: Today Horoscope | గ్రహాల కదలికల వల్ల ఈ రోజు (శనివారం, నవంబరు 8 – 2025) ఆయా రాశుల వారికి కలిగే ఆర్థిక లాభాలు, వ్యక్తిగత ఎదుగుదల గురించి జ్యోతిష్య పండితులు ఈ విధంగా వివరిస్తున్నారు.
కొన్ని రాశుల వారు తమ భయాలను జయించి, కొత్త శక్తిని పొందబోతున్నారని చెబుతున్నారు. మరికొన్ని రాశుల వారు చాలా కాలంగా ఆగిపోయిన బాకీలను వసూలు చేసుకోనున్నారుంటున్నారు. మరికొన్ని రాశుల వారు గందరగోళం నుంచి ఉపశమనం పొందనున్నట్లు వెల్లడిస్తున్నారు.
మేషరాశి Aries : Today Horoscope | ఆదాయం పెరుగుతుంది. కానీ, అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేసే ఒక ప్రత్యేక వ్యక్తిని స్నేహితులు మీకు పరిచయం చేస్తారు. మంచి ఆదాయం కోసం, ఇంట్లో ఒక వెండి నాణెంను గంగా జలంలో ఉంచండి.
వృషభ రాశి Taurus : Today Horoscope | మంచి పలుకుబడి ఉన్న వ్యక్తుల సహాయం గొప్ప నైతిక బలాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తుంది. గతంలో భవిష్యత్తు అవసరాల కోసం చేసిన పెట్టుబడులు మంచి ఫలితాలను అందిస్తాయి. విద్యార్థులు, యువకులు తమ ప్రాజెక్ట్‌ల గురించి ఇతరుల సలహాలు పొందుతారు.
మిథున రాశి Gemini : Today Horoscope | గతంలో ఉన్న అనేక ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పిల్లలతో సమయం గడపడం వలన ఆనందంగా, ప్రశాంతంగా ఉంటారు. గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సాధించాలనే సంకల్పం బలంగా ఉంటుంది.
కర్కాటక రాశి Cancer : Today Horoscope | పిల్లల నుంచి ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. ఇది ఆనందాన్ని ఇస్తుంది. బంధువులతో అనుబంధాలను, సంబంధాలను తిరిగి బలోపేతం చేసుకోవడానికి ఇది మంచి రోజు. కుటుంబ సభ్యులు అనేక సమస్యలను మీ ముందుకు తీసుకురావచ్చు.
సింహ రాశి Leo : కుటుంబ సభ్యులు ఇచ్చే మంచి సలహా, మానసిక ఒత్తిడిని చాలా వరకు తగ్గిస్తుంది. గ్రహచలనం ప్రకారం.. ఆసక్తికరమైన వ్యక్తిని కలిసే అవకాశాలు ఉన్నాయి. సామాజిక, మతపరమైన వేడుకలలో పాల్గొంటారు.
కన్యా రాశి Virgo : డ్రైవ్ చేసేటప్పుడు (వాహనం నడిపేటప్పుడు) చాలా జాగ్రత్తగా ఉండండి. సోదరి పెళ్లి సంబంధం కుదిరిన వార్త ఆనందాన్ని ఇస్తుంది. మీ దగ్గర అప్పు తీసుకున్నవారు, సమాచారం ఇవ్వకుండానే డబ్బును మీ ఖాతాలో జమ చేస్తారు.
తులా రాశి Libra : ఒత్తిడి నుంచి బయటపడగలుగుతారు. వ్యాపారంలో లాభాలు ఎలా పొందాలనే దానిపై పాత స్నేహితుడు సలహాలు ఇస్తారు. వారి సలహాలను పాటిస్తే అదృష్టం కలిసివస్తుంది. మంచి వ్యక్తిత్వం ఉన్నవారి ఆత్మకథలు చదవడం వలన ఆలోచనలు, ఆశయాలను మరింత దృఢపరుచుకుంటారు.
వృశ్చిక రాశి Scorpio : భయం.. ధైర్యాన్ని, ఆనందాన్ని దూరం చేస్తుంది. సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. వివాహితులు తమ అత్తమామల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. పాత స్నేహితులు సహాయం చేస్తారు. ప్రారంభించాలని అనుకుని మొదలుపెట్టని పనులను పూర్తి చేస్తారు.
ధనుస్సు రాశి Sagittarius : చాలా ఆర్థిక పథకాల (పెట్టుబడి ప్రణాళికలు) గురించి తెలుస్తాయి. వాటికి కమిట్ అయ్యే ముందు మంచి, చెడు అంశాలను క్షుణ్ణంగా పరిశీలించండి. వ్యక్తిగత స్థాయిలో చాలా దగ్గరగా ఉండే వ్యక్తులు కొన్ని సమస్యలను సృష్టించే అవకాశం ఉంది.
మకర రాశి Capricorn : వ్యాపారస్తులకు, ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటం వలన ఆనందంగా ఉంటారు. ఆర్థకపరంగా ఇబ్బందులు ఉండవు. ఆనందకరమైన జీవితాన్ని సాగించడానికి, విష్ణు చాలీసాను చదువుకోండి.. లేదా విష్ణువును స్తుతిస్తూ శ్లోకాలు పాడండి.
కుంభ రాశి Aquarius : సరదా స్వభావం మీ చుట్టూ ఉన్న ఇతరులను కూడా సంతోషంగా ఉంచుతుంది. చాలా కాలంగా వసూలు కాని బాకీలు తిరిగి వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రయాణం చేసిన వెంటనే ఫలితాలు కనిపించకపోయినా, అది భవిష్యత్ ప్రయోజనాలకు పునాది వేస్తుంది.
మీన రాశి Pisces : బంధుత్వాలను వదులుకుందాం అనేంత తగాదాలు అప్పుడప్పుడు వచ్చిన.., అంత సులువుగా ఆ పని చేయలేరు. గతంలో పోగొట్టుకున్న వస్తువులు దొరకడంతో ఆనందంగా ఉంటారు. గతంలో దాచి ఉంచిన డబ్బు వలన ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించుకోగలుగుతారు.
