Homeతాజావార్తలుToday Horoscope | ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారం బెడిసికొట్టడం ఖాయం!

Today Horoscope | ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారం బెడిసికొట్టడం ఖాయం!

Today Horoscope | చంద్రుడి సంచారం, ఇతర గ్రహాల స్థితిగతులను బట్టి చూస్తే, కొన్ని రాశుల వారు ఈ రోజు (ఆదివారం, నవంబరు 16) భావోద్వేగ పరమైన సవాళ్లు ఎదుర్కోనున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Horoscope | చంద్రుడి సంచారం, ఇతర గ్రహాల స్థితిగతులను బట్టి చూస్తే, కొన్ని రాశుల వారు ఈ రోజు (ఆదివారం, నవంబరు 16) భావోద్వేగ పరమైన సవాళ్లు ఎదుర్కోబోతున్నట్లు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

మేష రాశి: Today Horoscope | పెద్ద ఆర్థిక లావాదేవీల విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు లేకుండా, చాలా జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి.

కొన్ని సామాజిక, మతపరమైన వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉంది. బాధ కలిగించే ప్రదేశాలకు, పరిస్థితులకు దూరంగా ఉండటం మంచిది. ఓం శామ్ శనైశ్చరాయ నమ:’ అనే మంత్రాన్ని 11 సార్లు పఠించండి.

వృషభ రాశి: Today Horoscope | గ్రహాల కదలికల ప్రకారం.. ప్రేమ వ్యవహారాలలో కొంత చిరాకు, ఆందోళన ఉండవచ్చు. తప్పుడు విషయాలపై మాట్లాడటం వల్ల గొడవలు జరిగే అవకాశం ఉంది. మీ వద్ద అప్పు తీసుకుని చెల్లించని బంధువులు మళ్లీ అప్పు అడిగితే, వారికి డబ్బు ఇవ్వొద్దు.

మిథున రాశి: Today Horoscope | శారీరక పటిష్టతకు ఉపయోగపడే క్రీడలు ఆడటానికి, ఆనందించడానికి అవకాశం లభిస్తుంది. పిల్లలు చదువుపైన, భవిష్యత్తు గురించిన ఆలోచనలపైన శ్రద్ధ పెట్టాలి. చాలా రోజులుగా తీరిక లేకుండా గడుపుతున్న వారికి, సమయం దొరుకుతుంది.

కర్కాటక రాశి: Today Horoscope | మంచివని భావించే పనులను చేయడానికి చాలా అనుకూలమైంది. ఇంట్లో శాస్త్రోక్తంగా కర్మలు లేదా హోమాలు, పవిత్రమైన వేడుకలు నిర్వహించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి మీకు అందమైన సర్​ప్రైజ్ ఇవ్వడం ఖాయం.

సింహ రాశి: పూర్తి హుషారుగా, శక్తివంతులై ఉంటారు. ఏ పని చేసినా, తక్కువ సమయంలోనే పూర్తి చేస్తారు. ఇది అందరి దృష్టిని ఆకర్షించగలిగేలా ఉంటుంది. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఒక ఆధ్యాత్మిక గురువు, పెద్దమనిషి మార్గదర్శనం చేస్తారు.

కన్యా రాశి: అడ్డంకులను అధిగమించడానికి మీ అద్భుతమైన మేధాశక్తి సహాయపడుతుంది. మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి తల్లిదండ్రులు, స్నేహితులు చేతనైనంత కృషి చేస్తారు. భాగస్వాములు మీ ఆలోచనలకు, ప్రణాళికలకు మద్దతుగా (సపోర్టివ్‌గా) ఉంటారు.

తులా రాశి: ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేయడానికి ఖాళీ సమయం లభిస్తుంది. ఈ సమయంలో అనవసర తగాదాలకు దూరంగా ఉండండి. ఇంటి గురించి పెట్టుబడి (మదుపు) పెట్టడం లాభదాయకం. కుటుంబ బాధ్యతలు మనసులో ఆందోళనను పెంచేలా ఉండవచ్చు.

వృశ్చిక రాశి: ఆరోగ్యం బాగుంటుంది. కొన్ని ముఖ్యమైన పథకాల అమలుతో కొత్తగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. మీరు ప్రాముఖ్యమిచ్చే వారు సరైన సమాచారం అందక, నిరాశ కలిగిస్తుంది.

జీవితంలో కొన్ని అనుకూల మార్పులు సంభవిస్తాయి. పిల్లల మీద నిందలు (అభియోగాలు) పడతాయి. ఇది విచారాన్ని కలిగిస్తుంది.

ధనుస్సు రాశి: చాలాకాలంగా పరిష్కారం కాని సమస్యను, మీ చురుకుదనం వల్ల పరిష్కారం అవుతాయి. చాలాకాలం తర్వాత, జీవిత భాగస్వామి శాంతియుతంగా, ఎలాంటి గొడవలు లేకుండా ఉంటారు.

తల్లిదండ్రులకు మీ లక్ష్యాన్ని చెప్పడానికి ఇది తగిన సమయం. వారు మిమ్మల్ని మనస్ఫూర్తిగా సమర్థిస్తారు.

మకర రాశి: జీవితంలో సమస్యలు తొలగించుకోవడానికి, ఒక సైకాలజిస్ట్‌ను కలిసే అవకాశం ఉంది. సమయాన్ని వృథా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి. ప్రమాదం కలిగించే పరిస్థితులకు దూరంగా ఉండండి. చక్కని ఆరోగ్యం కోసం వాకింగ్, యోగా చేయండి.

కుంభ రాశి: విచారంలో ఉన్నవారికి సహాయం చేస్తారు. సానుకూల దృక్పథం (Positive Attitude) జీవితాన్ని మార్చివేస్తుంది. చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్నవారికి బాగా కలిసివస్తుంది. ఇతరులను మురిపించే గుణం, మెప్పును పొందే సామర్థ్యం రివార్డ్‌లను తెస్తాయి.

మీన రాశి: ఆర్థిక సంబంధ సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక ప్రయోజనాలను పొందగలరు. ఉత్తర ప్రత్యుత్తరాలు (కమ్యూనికేషన్) విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కొద్దిగా ప్రయత్నిస్తే, జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు కాగలదు.

Must Read
Related News