అక్షరటుడే, వెబ్‌డెస్క్: Today Horoscope | మేషం నుంచి మీనం వరకు ఈ రోజు (నవంబరు 11) అన్ని రాశుల వారికి ఆర్థిక, కుటుంబ, ప్రేమ, వృత్తిపరమైన విషయాలలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం.
మేషరాశి Aries : Today Horoscope | మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి వెనుకడుగు వేయకండి. ఆత్మ విశ్వాసం లోపం మిమ్మల్ని చుట్టుముట్టొద్దు. అది మీసమస్యను మరింత జటిలం చేస్తుంది.
మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలదు. ఈ రాశివారు ఇవాళ ధనాన్ని స్థిరాస్తికి సంబంధించిన సమస్యల మీద ఖర్చు చేస్తారు. ఒక చిన్నారి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది.
మీ హృదయ స్పందనలు కూడా మీ భాగస్వామి గుండె చప్పుళ్లతో సరిసమాన వేగంతో ప్రేమ సంగీతాన్ని వినిపిస్తాయి. విజయం చేరువలోనే ఉంటుంది. సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి. కానీ సమయాన్ని వృథా చేస్తారు. దీని ఫలితంగా మూడ్ పాడవుతుంది.
వృషభ రాశి Taurus : Today Horoscope | సంతృప్తికరమైన జీవితం కోసం మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకొండి. ఇవాళ, మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పుతీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్లీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి.
సానుకూల దృక్పథం కలిగి, సమర్థించగల త్రులతో బయటకు వెళ్ళండి. ఆఫీసులో ఇవాళ మంచి ఎదుగుదలకు అవకాశముంది. జీవిత భాగస్వామిని ఎంతగా ప్రేమిస్తున్నదీ తనకు తెలిసేలా చెప్పండి.
మిథున రాశి Gemini : Today Horoscope | రిలాక్స్‌గా ఉంటారు. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది. భాగస్వామి మాటలకు లొంగడం కష్టం.
ప్రేమానురాగాలను పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి. లేదంటే దాంపత్య సమస్యలు తప్పవు. ఎవరైనా మిమ్మల్ని అప్సెట్ చెయ్యాలని చూస్తారు.
కానీ, కోపాలేవీ మిమ్మల్ని ఆక్రమించకుండా చూసుకోండి. అనవసర ఆందోళనలు, బెంగ, మీ శరీరంపైన డిప్రెషన్ వంటి ఒత్తిడులు, చర్మ సంబంధ సమస్యలకు దారితీసి ఇబ్బంది పెడతాయి. ముఖ్యమైన విషయాలపై ధ్యాస పెట్టాలి.
కర్కాటక రాశి Cancer : Today Horoscope | తాత్కాలిక అప్పుల కోసం వచ్చిన వారిని, చూడనట్లుగా వదిలెయ్యండి. ఇంటి పనులు పూర్తి చేయడంలో, పిల్లలు సహాయపడతారు.
ప్రేమ జీవితంపరంగా ఈ రోజు ఎంతో అద్భుతమైనది. ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతిని చవిచూస్తారు. ఆఫీసులో అన్ని అంశాలూ అనుకూలంగా ఉండవచ్చు.
సింహ రాశి Leo : ఆర్ధిక పరిస్థితి దృఢంగా ఉంటుంది. అయినప్పటికీ ఖర్చులు తగ్గించాలి. ఉల్లాసంగా ఉంటారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.
కన్యా రాశి Virgo : పరిస్థితిపై ఒకసారి అదుపు వచ్చాక, ఆతృత మాయమైపోతుంది. ఆర్ధికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఇది ఆర్ధిక లాభాన్ని చేకూరుస్తుంది.
మీ సమస్యలను మరచి, కుటుంబ సభ్యులతో సమయం చక్కగా గడపనున్నారు. కలిసి గడిపిన ఆహ్లాదకరమైన రోజులను గుర్తుచేసుకుంటూ రిఫ్రెష్ కావాల్సిన సమయం.
ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఆఫీసులో ఉత్సాహంగా పనిచేస్తారు. నిర్దేశించిన సమయం కంటే ముందే పనులు పూర్తిచేస్తారు. మీ పదునైన పరిశీలన అందరికంటే ముందుండేలా చేస్తుంది.
తులా రాశి Libra : కొన్ని మానసిక ఒత్తిడులు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. విదేశాల్లో సంబంధాలు ఉన్న వ్యాపారస్థులకు, ట్రేడ్ వర్గాల వారికి కొంత ధన నష్టం సంభవిస్తుంది.
కాబట్టి అడుగు వేసే ముందు ఆచితూచి వ్యవహరించటం మంచిది. మీ సరదా స్వభావం చుట్టూరా ఉన్న చోటంతా నవ్వులతో ప్రకాశింపచేస్తుంది. ప్రయాణాలకు అంత మంచి రోజు కాదు. వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు తెలుస్తాయి.
వృశ్చిక రాశి Scorpio : మనసును ప్రేమ, ఆకాంక్ష, విశ్వాసం, సానుభూతి, ఆశావాదం, వినయ విధేయతలు మొదలైన సానుకూలమైన ఆలోచనలు వస్తే స్వీకరించేలా సిద్ధపరచండి.
మనసులో ఒకసారి ఈ భావోద్వేగాలు ఆక్రమించాక, ప్రతి పరిస్థితిలోనూ మనసు ఆటోమేటిక్‌గా సానుకూలంగా స్పందిస్తుంది.
మీ సరదా స్వభావం చుట్టూరా ఉన్న చోటంతా నవ్వులతో ప్రకాశింపచేస్తుంది. పనిలో అన్ని విషయాలూ ఈ రోజు సానుకూలంగా కన్పిస్తున్నాయి. రోజంతా మీ మూడ్ బాగుండనుంది.
ధనుస్సు రాశి Sagittarius : సేదతీరగల రోజు. శరీరానికి నూనె మర్దన చేయించుకుని కండరాలకు విశ్రాంతిని కలిగించండి. చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్నవారికి బాగా కలిసివస్తుంది.
ఒక అద్భుతమైన సాయంత్రం వేళ ఉల్లాసం కోసం బంధువులు / మిత్రులు వస్తారు. ప్రియమైనవారితో బయటకు వెళ్ళడానికి ప్లాన్ వేస్తారు. కానీ, ముఖ్యమైన పనుల వల్ల వెళ్లలేరు.
దీనివలన ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంటుంది. పనిలో వస్తున్న మార్పులతో ప్రయోజనం కలుగుతుంది. ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో, గురుద్వారాలో, ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు. సమస్యలకు, వివాదాలకు దూరంగా ఉంటారు.
మకర రాశి Capricorn : సరైన నిర్ణయం తీసుకోవడానికి ఆలోచన విధానం స్పష్టంగా ఉండాలి. తాత్కాలిక అప్పుల కోసం వచ్చిన వారిని, చూడనట్లుగా వదిలెయ్యండి.
‘మీ రోజువారీ యాంత్రిక జీవనానికి అడ్డుకట్ట వేస్తూ స్నేహితులతో బయటకు వెళ్ళండి. జీవిత భాగస్వామి అవసర సమయాల్లో కుటుంబ సభ్యులతో పోలిస్తే తన సొంత కుటుంబ సభ్యులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి ఇబ్బంది పెట్టవచ్చు.
కుంభ రాశి Aquarius : బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది. వ్యాపారాన్ని విదేశాలకు తీసుకువెళ్లాలని అనుకునేవారికి ఆర్ధికంగా అనుకూలంగా ఉంటుంది.
ఇతరుల ధ్యాసను పెద్దగా కష్ట పడకుండానే, ఆకర్షించడానికి ఇవాళ సరైనది. తొలి చూపులోనే ప్రేమలో పడే ఛాన్స్ ఉంది.
ఈ రోజు చాలా చురుకుగాను, అందరికీ చాలా చక్కని సోషల్ డ్గా ఉంటుంది. మీ సలహా కోసం ఎదురు చూసేవారు ఉంటారు. మీ నోటి నుంచి ఏది వస్తే దానినే అంగీకరించి, శిరసా వహిస్తారు.
మీన రాశి Pisces : ధనాన్ని దాచిపెడితే ఆపత్కాలంలో ఉపయోగపడుతుంది. కుటుంబ సభ్యులు, మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు.
ఇష్టమైన వారు మీ అలవాట్ల మీద అసహనాన్ని ప్రదర్శిస్తారు. తద్వారా మీకు కోపం కలుగుతుంది. మహిళ సహా ఉద్యోగుల సహకారం ఎక్కువ ఉంటుంది. పెండింగు పనులను పూర్తి చెయ్యడంలో సహాయపడతారు.
ఇంటికి దూరంగా ఉంటున్నవారు వారి ఖాళీ సమయంలో పార్కులో కానీ, లేక ప్రశాంతంగా ఉండే చోటులో కానీ సమయాన్ని గడుపుతారు.
