Homeతాజావార్తలుToday Horoscope | ఈ రోజు ఆ రాశుల వారు తస్మాత్​ జాగ్రత్త సుమా!

Today Horoscope | ఈ రోజు ఆ రాశుల వారు తస్మాత్​ జాగ్రత్త సుమా!

Today Horoscope | గ్రహాల కదలిక కారణంగా చాలా రాశుల వారు అనుకూల ఫలితాలను అందుకోనున్నారు. కొత్త ఒప్పందాల ద్వారా ఆర్థికంగా పెద్ద లాభాలు, ఆఫీసులో ప్రశంసలు దక్కే అవకాశం ఉంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Horoscope | గ్రహాల కదలికలు ఈ రోజు (సోమవారం, నవంబరు 10)  చాలా రాశుల వారికి అనుకూల ఫలితాలను అందించబోతున్నాయి.

కొత్త ఒప్పందాల ద్వారా ఆర్థికంగా లాభాలు, ఆఫీసులో ప్రశంసలు దక్కే అవకాశం ఉంది. కొన్ని రాశుల వారు అద్భుతమైన ఆరోగ్యం, కుటుంబ సభ్యుల మద్దతుతో ఉత్సాహంగా ముందుకు సాగుతారు. మరికొన్ని రాశుల వారు పెట్టుబడులు పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి.

మేషరాశి Aries : Today Horoscope | సామూహిక కార్యక్రమాలలో పాల్గొని ఆనందిస్తారు. ఆఫీసులో అందరూ మిమ్మల్ని అభిమానిస్తారు. సహాయం చేస్తారు. ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.

వృషభ రాశి Taurus : Today Horoscope | సానుకూల దృక్పథం, ఆత్మవిశ్వాసంతో ఇతరులను సులభంగా ఆకట్టుకుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడులకు దూరంగా ఉండండి. బయట ఆప్తులతో సంతోషంగా గడుపుతారు. దుర్గా దేవి ప్రసాదాన్ని పేదలకు పంచడం ద్వారా మంచి కుటుంబ జీవితాన్ని పొందవచ్చు.

మిథున రాశి Gemini : Today Horoscope | పర్యావరణ సంబంధిత విషయాలలో పెట్టుబడి పెడితే తప్పకుండా లాభం పొందుతారు. ఇవాళ అంతగా బాగోదు. అనేక విషయాలపై వివాదాలు, విభేదాలు తలెత్తవచ్చు. ఇది సంబంధాన్ని బలహీనం చేస్తుంది.

కర్కాటక రాశి Cancer : Today Horoscope | వృత్తిలో నైపుణ్యానికి పరీక్ష ఎదురవుతుంది. మంచి ఫలితాలు సాధించడానికి ఏకాగ్రతతో కష్టపడాలి. స్థలం అమ్మాలనుకునేవారికి కొనుగోలుదారులు దొరుకుతారు. దీని వలన బాగా కలిసి వస్తుంది. పన్నులు, బీమాకు సంబంధించిన విషయాలపై కొంత దృష్టి పెట్టాలి.

సింహ రాశి Leo : ఇది ప్రత్యేకమైన రోజు. ఆరోగ్యంగా ఉండటం వలన అనుకున్న పనులన్ని పూర్తి చేయగలుగుతారు. ఇంటికి సంబంధించిన పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. జీవితంలో బాగా స్థిరపడినవారు, భవిష్యత్తు గురించి సరైన సలహాలు ఇవ్వగలిగిన వారితో ఉండండి.

కన్యా రాశి Virgo : ముఖ్యమైన పథకాలు అమలులోకి వచ్చి ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి. మంచి పనులకు ఆఫీసులో అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు. ప్రణాళికలో ప్రయాణం, వినోదం, సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పవిత్ర స్థలాల్లో దుప్పట్లను దానం చేయడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది.

తులా రాశి Libra : కొత్త ఒప్పందాలు మంచి లాభాన్ని చేకూర్చే అవకాశం ఉంది. అనుకోని శుభవార్త అందవచ్చు. ఇది కుటుంబంలో ఉత్సాహాన్ని నింపుతుంది. ఆఫీసులో వివాదాలు, రాజకీయాల గురించి మర్చిపోండి.

ఆఫీసులో మీదే పైచేయి అవుతుంది. పనిలో ప్రశంసలు లభించవచ్చు. ధనం బాగా కలిసి రావడానికి ఉదయం పూట సూర్యదేవునికి ఎరుపు రంగు పూలను సమర్పించండి.

వృశ్చిక రాశి Scorpio : గతంలో కంటే ఆర్థికంగా మెరుగ్గా ఉంటారు. తగినంత ధనం ఉంటుంది. పరిస్థితిని, అవసరాలను అర్థం చేసుకోగల సన్నిహితులైన స్నేహితులతో బయటకు వెళ్తారు. మెరుగైన భవిష్యత్తు కోసం చేసే ప్రయాణాలు సాకారమవుతాయి. ఇవాళ కొద్దిగా శ్రమతో కూడిన రోజు.

ధనుస్సు రాశి Sagittarius : ఆరోగ్యం బాగా ఉంటుంది. బంధువులు, స్నేహితుల నుంచి ఊహించని బహుమతులు, కానుకలు అందుతాయి. మీపై మీకు గల నమ్మకంతో ఇతరుల సహాయంతో డబ్బు సంపాదించగలుగుతారు. ఆఫీసులో చేసిన మంచి పనులకు గుర్తింపు లభిస్తుంది.

మకర రాశి Capricorn : స్నేహితుడితో అపార్థం కారణంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తవచ్చు. ఇంటికి సంబంధించిన పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. చిన్న వ్యాపారస్తులు నష్టాలను చూడవచ్చు. కష్టపడి సరైన పద్ధతిలో ప్రయత్నిస్తే తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారు.

కుంభ రాశి Aquarius : బలంగా ఉండేందుకు వ్యాయామం చేయండి. ఇతరుల మాట విని పెట్టుబడి పెడితే ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఖాళీ సమయంలో, ప్రారంభించాలని అనుకుని ఇంకా మొదలుపెట్టని పనులను పూర్తి చేస్తారు. భాగస్వాములు మీ ఆలోచనలకు, ప్రణాళికలకు మద్దతు ఇస్తారు.

మీన రాశి Pisces : ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేయగల ఒక ప్రత్యేక వ్యక్తిని స్నేహితులు పరిచయం చేస్తారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినవారు ఇవాళ నష్టాలను చూడవచ్చు. కాబట్టి పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. రహస్య వ్యవహారాలు ప్రతిష్ఠను నాశనం చేస్తాయి.

Must Read
Related News