అక్షరటుడే, వెబ్డెస్క్: Today Horoscope | చాలా రాశుల వారికి ఈ రోజు (మంగళవారం, డిసెంబరు 9) ఇవాళ ఆర్థిక పరిస్థితులు చాలా వరకు సానుకూలంగా ఉన్నాయి. పాత పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. ఊహించని ధన లాభం లభించవచ్చు. కొన్ని ఆకర్షణీయమైన పథకాల విషయంలో లోతుగా ఆలోచించి, నిపుణుల సలహా తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రేమ, కుటుంబ సంబంధాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అయితే, కుటుంబ బాధ్యతలు ఆందోళన కలిగించవచ్చు, చిన్న చిన్న విషయాలకు భాగస్వామిని విమర్శించకుండా జాగ్రత్త వహించాలి.
మేష రాశి: Today Horoscope | ఊహించని విధంగా డబ్బు చేతికి అందడం వలన బిల్లులు, అత్యవసర ఖర్చులు తీరిపోతాయి. ఆర్థికంగా ఉపశమనం లభిస్తుంది. ఇంట్లో చిన్నపాటి సమస్యలు రావచ్చు. ఇవాళ పెద్ద భూ సంబంధిత వ్యవహారాలను డీల్ చేయగలుగుతారు.
వృషభ రాశి: Today Horoscope | ఇవాళ చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఏదైనా మత సంబంధమైన ప్రదేశానికి వెళ్లే అవకాశం ఉంది. దీని వలన మనసుకు ప్రశాంతత, శాంతి కలుగుతాయి. పోగొట్టుకున్న వస్తువులు తిరిగి దొరకడం వలన ఆనందంగా ఉంటారు.
మిథున రాశి: Today Horoscope | దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదు. కొత్తగా భాగస్వామ్య వ్యాపార ఒప్పందాలు కోసం చూస్తుంటే, ఒప్పందం చేసుకునే ముందే అన్ని వాస్తవాలను తెలుసుకుని ఉండటం అవసరం. మంచి ఆలోచనలతో ఉంటారు. ఎంచుకున్న కార్యక్రమాలు అంచనాకు మించి లాభాన్ని చేకూరుస్తాయి.
కర్కాటక రాశి: Today Horoscope | కష్టపడి పనిచేయడం, సరైన ప్రయత్నాలు చేయడం వలన మంచి ఫలితాలు, ప్రశంసలు పొందుతారు. ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోరు. ఎవరిని కలవడానికి ఇష్టపడకుండా, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు.
సింహ రాశి: మతపరమైన, ఆధ్యాత్మిక విషయాల కోసం కూడా సమయాన్ని కేటాయించగలుగుతారు. ముఖ్యమైన వ్యక్తులు, మీరు ప్రత్యేకంగా అనిపిస్తే, ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు.
పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని చాలా గర్వపడేలా చేస్తారు. సహ ఉద్యోగులు, సీనియర్ల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. దాంతో ఆఫీసులో పని త్వరగా పూర్తవుతుంది.
కన్యా రాశి: యోగా సాధన చేయడం వలన శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉంటారు. డ్రైవింగ్ చేసేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోండి.
పనిలో ఉన్నప్పుడు, సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండి, తెలివి, ఓర్పును ప్రదర్శించండి. ప్రయాణ ప్లాన్లు ఏమైనా ఉంటే, అవి ఆఖరి నిమిషంలో వచ్చిన మార్పుల వలన వాయిదా పడతాయి.
తులా రాశి: పెట్టుబడి పథకాలు ఆకర్షణీయంగా కనిపించినా, లోతుగా ఆలోచించండి. వాటి పూర్వాపరాలు తెలుసుకోండి. ఏదైనా కమిట్ అయ్యే ముందు నిపుణులు, అనుభవజ్ఞుల సలహా పొందండి. మిగతా అన్ని రోజుల కంటే మీ తోటి సిబ్బంది మిమ్మల్ని మరింత బాగా అర్థం చేసుకుని, సహకరిస్తారు. అతిథులు ఇంటికి వచ్చి ఈ రోజును ఆహ్లాదకరంగా, అద్భుతంగా మారుస్తారు.
వృశ్చిక రాశి: కొంతమందికి ప్రయాణం అలసటను, ఒత్తిడిని కలిగిస్తుంది. అయితే, ఇది ఆర్థికంగా కలిసి వస్తుంది. ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు. పూర్తవకుండా మిగిలిపోయిన పనులను పూర్తి చేయడానికి కూడా మంచిది. మీకున్న నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం వస్తుంది.
ధనుస్సు రాశి: డబ్బులను పొదుపు చేయాలనే ఆలోచన ఆచరణలోకి వస్తుంది. ధనాన్ని ఆదా చేయగలుగుతారు. సృజనాత్మకత తగ్గిపోయిందని, ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని భావిస్తారు, ఇది మీకు కష్టంగా ఉంటుంది. మీరు, మీ భాగస్వామి ఒక అద్భుతమైన వార్తను అందుకుంటారు. కాలానుగుణంగా వచ్చే కొంత అలసట (పీరియాడికల్ బ్రేక్ డౌన్) మీకు సమస్యలను కలిగించవచ్చు.
మకర రాశి: అప్పులు చేసిన వారికి, వాటిని తిరిగి చెల్లించేటప్పుడు సమస్యలు ఎదురు కావచ్చు. అనుభవజ్ఞులను కలుస్తారు. వారు భవిష్యత్తు ధోరణుల గురించి చెప్పేది వినడం మీకు ఉపయోగపడుతుంది. ఇవాళ ప్రారంభం కొంచెం అలసటగా ఉంటుంది. కానీ రోజు గడిచేకొద్దీ మంచి ఫలితాలను పొందుతారు. మీ కల నెరవేరుతుంది.
కుంభ రాశి: కుటుంబ బాధ్యతలు మనసులో ఆందోళనను పెంచేలా ఉంటాయి. ఇతర దేశాలలో వృత్తిపరమైన సంబంధాలు (నెట్వర్క్) నెలకొల్పడానికి ఇది అద్భుతమైన సమయం. ఇవాళ అనేక వస్తువుల మీద డబ్బు ఖర్చు చేస్తారు. ఖర్చుల విషయంలో బడ్జెట్ నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. అప్పుడే అన్ని సమస్యలను ఎదుర్కోగలరు.
మీన రాశి: గతంలో చేసిన పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. పెట్టుబడి పెట్టడం ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో ఇవాళ మీరు తెలుసుకుంటారు. పిల్లల నుంచి అనుకోని వార్త వచ్చి మిమ్మల్ని సంతోషపరుస్తుంది. కార్యాలయాల్లో మీ శక్తి సామర్థ్యాలు తక్కువగా ఉంటాయి. దీనికి కుటుంబ సమస్యలు కారణం కావచ్చు. వ్యాపారస్తులు వారి భాగస్వాముల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. వారు మీకు హాని తలపెట్టవచ్చు.