అక్షరటుడే, వెబ్‌డెస్క్: Today Horoscope | జాతక చక్రం ప్రకారం నేడు (ఆదివారం, డిసెంబరు 15) పలు రాశులవారు వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో సానుకూల మార్పులు తీసుకురావడానికి సరైన రోజు. చాలా కాలంగా ఉన్న ఒత్తిడి, అలసట, కష్టాల నుంచి ఈ రోజు ఉపశమనం లభిస్తుంది.
ముఖ్యంగా పిల్లల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు, మొండి బకాయిల వసూలు వంటి లాభాలు కలగవచ్చు. అయితే, ఖర్చుల విషయంలో నియంత్రణ పాటించాలి. యోగా, ధ్యానం వంటివి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. స్నేహితులు, కుటుంబ సభ్యుల మద్దతు లభించడం, ఇతరులతో సంతోషకరమైన విషయాలు పంచుకోవడం ఆనందాన్నిస్తుంది. వృత్తిపరంగా చూస్తే.. నైపుణ్యాలను ప్రదర్శించడానికి, కొత్త క్లయింట్లతో చర్చలు జరపడానికి మంచి అవకాశం ఉంది.
మేష రాశి: Today Horoscope | పిల్లల వలన ఆర్థిక లాభాలు కలుగుతాయి. వారిని చూసి చాలా గర్వపడతారు. నైపుణ్యాలను ప్రదర్శించడానికి మంచి అవకాశం లభిస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉండండి. లేదంటే సమస్యలు రావచ్చు.
వృషభ రాశి: Today Horoscope | చాలా కాలంగా అనుభవిస్తున్న టెన్షన్లు, అలసట, కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఆ డబ్బును దాన ధర్మాలకు ఉపయోగిస్తారు. దీనివల్ల మానసిక ఆనందం కలుగుతుంది. ఇవాళ జాగ్రత్తగా ఉండాలి. మీ ఆలోచనలు కచ్చితంగా ఫలిస్తాయని నిర్ధారణ అయ్యే వరకు వాటిని ఇతరుల ముందు చెప్పకండి.
మిథున రాశి: Today Horoscope | వస్తువులను కొనుగోలు చేయవచ్చు. అవి భవిష్యత్తులో మంచి విలువను పెంచుకునే అవకాశం ఉంది. ఇంటి పరిస్థితుల కారణంగా కాస్త అలజడికి గురికావచ్చు. చుట్టూ ఉన్న సమస్యలను పరిష్కరించడానికి మీకున్న పరపతి ఉపయోగించాల్సిన అవసరం ఉంది.
కర్కాటక రాశి: Today Horoscope | చాలా రోజులుగా ఋణం కోసం ప్రయత్నిస్తున్న వారికి బాగా కలిసివస్తుంది. పనిలో కొద్దిసేపు పరధ్యానంగా ఉన్నప్పటికీ, సహోద్యోగులు వచ్చి సహాయం చేస్తారు. ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా ఆధ్యాత్మిక ప్రదేశంలో గడుపుతారు. దీనివల్ల అనవసర సమస్యలకు, వివాదాలకు దూరంగా ఉంటారు.
సింహ రాశి: కోర్టు సంబంధిత ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ముగుస్తాయి. దీనివల్ల ఆర్థిక లాభం కలుగుతుంది. కుటుంబం మీకు అండగా ఉండి, కష్ట సమయాలలో సహాయం చేస్తుంది. పనిలో ప్రశంసలు లభించే అవకాశం ఉంది. ఇతరులను గమనించడం ద్వారా కొన్ని గుణపాఠాలు నేర్చుకోవచ్చు. నిరంతరం అభ్యాసం చేయడం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో చాలా సహాయపడుతుంది.
కన్యా రాశి: ఎక్కువ ప్రయాణాలు చేయడం వల్ల అలసిపోయినట్లుగా, చికాకు పడినట్లుగా అనిపించవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యక్తిగత విషయాలను కేవలం సాధారణ పరిచయస్తులతో పంచుకోకండి. బిజినెస్ మీటింగ్స్‌లో ముక్కుసూటిగా మాట్లాడటం లేదా భావోద్వేగాలకు లోనుకావడం వంటివి చేయకండి. మీకు చాలా అనుకూలమైన రోజు. మంచి భవిష్యత్తు కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు.
తులా రాశి: ఇవాళ మీ ముందుకు వచ్చే పెట్టుబడి పథకాల గురించి నిర్ణయం తీసుకునే ముందు, ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఆ తరువాతే పెట్టుబడి పెట్టండి. కొత్త క్లయింట్లతో చర్చలు జరపడానికి ఇది అద్భుతమైన రోజు. సెమినార్లు, ఎగ్జిబిషన్ల కారణంగా కొత్త విషయాలు తెలుస్తాయి, పరిచయాలు పెరుగుతాయి.
వృశ్చిక రాశి: డబ్బు సంపాదించినా, అది చేతి నుంచి జారిపోకుండా జాగ్రత్త వహించండి. ఇవాళ యోగ, ధ్యానంతో ప్రారంభించండి. ఇది చాలా అనుకూలంగా ఉండి, రోజంతా మీలో శక్తిని నిలుపుతుంది. పాత స్నేహితులు మీకు మద్దతుగా ఉండి, సహాయం చేస్తారు. ఒక ఆధ్యాత్మిక గురువు మీకు సరైన మార్గదర్శనం చేస్తారు.
ధనుస్సు రాశి: ఇవాళ డబ్బును సంపాదించగలుగుతారు. మొండి బకాయిలను వసూలు చేయవచ్చు, లేదా కొత్త ప్రాజెక్టుల కోసం నిధులను సేకరించవచ్చు. చెల్లి లేదా తమ్ముడు మీ సలహాను తీసుకుంటారు. ఒకరి మనసు బాధపడకుండా కాపాడతారు. ఇతరులతో అనుభవ జ్ఞానాన్ని పంచుకుంటే, మీకు మంచి గుర్తింపు లభిస్తుంది.
మకర రాశి: వ్యాపారస్తులకు, ట్రేడర్లకు లాభాలు రావటం వలన వారు ఆనందంగా ఉంటారు. ఇంటి వాతావరణాన్ని మార్చడానికి ముందు, కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు ఆమోదించేలా చూసుకోండి. జీవిత భాగస్వామి, మీకు కొన్ని ప్రత్యేకమైన సర్ప్రైజ్లు ఇస్తారు.
కుంభ రాశి: జీతాలు రాక ఆర్థిక ఇబ్బంది పడుతున్న వారు ఇవాళ వారి స్నేహితులను కొంత డబ్బు అప్పుగా అడగవచ్చు. మీరు సామాజిక కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశం ఉంది. అక్కడ మీకు పరపతిగలవారు పరిచయం కావచ్చు. భాగస్వామ్యంతో కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇది మంచి రోజు. అందరికీ లాభం పొందే అవకాశం ఉంది. అయితే, భాగస్వాములతో చేతులు కలిపే ముందు మరొకసారి ఆలోచించండి.
మీన రాశి: ఇవాళ మీ తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు పొందుతారు. వ్యవస్థాపకులతో కలిసి కొత్త వెంచర్లను (వ్యాపారాలు/ప్రాజెక్టులు) ప్రారంభించండి. ఇవాళ మంచి సంఘటనలు, కలత కలిగించే సంఘటనలు రెండూ కలిసి ఉంటాయి. ఇది మిమ్మల్ని అయోమయంలో పడేసి, అలసిపోయేలా చేస్తుంది.