Homeబిజినెస్​Today Gold Price | పసిడి ప్రియులకు గుడ్​న్యూస్​.. ధరలు క్రమంగా తగ్గుముఖం

Today Gold Price | పసిడి ప్రియులకు గుడ్​న్యూస్​.. ధరలు క్రమంగా తగ్గుముఖం

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : ఇటీవల భారీగా పెరిగిన బంగారం Gold ధరలు వరుసగా మూడో రోజూ తగ్గుతూ రావడం కొనుగోలుదారులకు ఊరట కలిగించే పరిణామంగా చెప్ప‌వ‌చ్చు. అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గటం, ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల (US Federal Reserve’s interest rates) విషయంలో అనిశ్చితి వంటి కారణాల వల్ల బంగారం ధరలు దిగివస్తున్నాయి. పెట్టుబడిదారులు ఇప్పుడు బంగారాన్ని వదిలి ఇతర ఆస్తుల వైపు దృష్టి మళ్లించడంతో మార్కెట్లో ఆ ప్రభావం స్ప‌ష్టంగా కనిపిస్తోంది.

Today Gold Price : కాస్త త‌గ్గుముఖం..

జూన్ 26 నాటి ఉదయం వరకు ఉన్న సమాచారం ప్రకారం, స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 3333 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే స్పాట్ సిల్వర్ ఔన్సుకు 36.35 డాలర్లకు పడిపోయింది. మరోవైపు, రూపాయి Rupee విలువ మరోసారి క్షీణించి డాలర్‌తో పోలిస్తే రూ.86.028 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం (24-carat pure gold) ధర రూ.1470 తగ్గింది. ఆ త‌ర్వాత‌ మళ్లీ రూ.270 తగ్గడంతో ప్రస్తుతం 10 గ్రాములు బంగారం ధర రూ.98,950 వద్ద ఉంది. ఇక 22 క్యారెట్ల నగల బంగారం (22-carat jewelry gold) ధర మరో రూ.250 తగ్గి, తులం ధర రూ.90,700 వద్దకు వచ్చింది.

Today Gold Price : వెండి కూడా..

బంగారంతో పాటు వెండి silver ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా పెరిగిన వెండి ధర ఇవాళ మరో రూ.1000 తగ్గింది. కిలో వెండి ధర ప్రస్తుతం రూ.1,18,000 గా ఉంది. ఇదే క్రమంలో, ఢిల్లీలో వెండి ధరలు కిలోకు రూ. 1000 తగ్గి, ప్రస్తుతం రూ. 1,07,800 గా ఉంది.

Today Gold Price : దేశంలోని ప్రధాన నగరాల్లో..

అలాగే, దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా వెండి ధ‌ర‌లు త‌గ్గాయి. మరోవైపు వరంగల్ Warangal, హైదరాబాద్ Hyderabad, తిరుపతి Tirupati, విజయవాడ Vijayawada వంటి ప్రాంతాలలో కూడా కిలో వెండి ధరలు రూ. 1,000 తగ్గ‌డంతో.. ఇప్పుడు, రూ. 1,17,900గా ధర ఉంది. ఇక ఇదే సమయంలో చెన్నై, కేరళ ప్రాంతాలలో కూడా వెండి ధర రూ. 1,17,900 పలుకుతోంది.

Must Read
Related News