Homeబిజినెస్​Today Gold rate | ఈ రోజు కాస్త తగ్గిన బంగారం ధ‌ర‌లు.. తులం ఎంతంటే..!

Today Gold rate | ఈ రోజు కాస్త తగ్గిన బంగారం ధ‌ర‌లు.. తులం ఎంతంటే..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Today Gold rate | బంగారం ధ‌ర‌లు ఎప్పుడు పెరుగుతున్నాయో ఎప్పుడు త‌గ్గుతున్నాయో అర్ధం కాని పరిస్థితి. అంత‌ర్జాతీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో బంగారం ధ‌రల‌లో హెచ్చు తగ్గులు గ‌మ‌నిస్తున్నాం. జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం (pure 24-carat gold) ధర విపరీతంగా పెరుగుతూ వెళ్లింది. ఏప్రిల్ మొదటి వారంలో ఏకంగా లక్ష రూపాయలకు చేరింది. బంగారం కొనాలనుకునే పేద, మధ్య తరగతి వారికి షాక్ ఇచ్చింది. అనంతరం బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి. 24 క్యారెట్ల బంగారం ధర లక్ష రూపాయల నుంచి ఏకంగా రూ.96 వేలకు పడిపోయింది. అయితే నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు బంగారం ధరలు (gold prices) స్వల్పంగా తగ్గాయి.

Today Gold rate | త‌గ్గిన ధ‌ర‌లు..

హైద‌రాబాద్ (Hyderabad) నగరంలో నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 89,200 రూపాయలు, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం (24-carat gold) ధర 97,310 రూపాయలు, 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 72,990 రూపాయలుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాముల బంగారంపై.. గ్రాముకు ఒక రూపాయి చొప్పున 10 రూపాయలు తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 97,300 రూపాయలు., 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 89,190 రూపాయలు., 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 72,980 రూపాయలుగా ఉంది. ఇక మిగతా న‌గ‌రాల‌లో కూడా దాదాపు ధ‌ర‌లు అటూ ఇటుగానే ఉన్నాయి.

ఇక బంగారం ధరలతో సంబంధం లేకుండా వెండి ధరలు (silver prices) ప్రతీ రోజు ఎంతో కొంత తగ్గుతూ వస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఇది కొంత ఉప‌శ‌మ‌నంగా చెప్ప‌వ‌చ్చు. నిన్న హైదరాబాద్ నగరంలో (Hyderabad city) 100 గ్రాముల వెండి ధర 11,090 దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర (Silver Price) రూ.1,10,900 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు 100 గ్రాముల వెండిపై 10 రూపాయలు, కేజీ వెండిపై 100 రూపాయలు తగ్గింది. 100 గ్రాముల వెండి ధర నేడు రూ.1,10,900 దగ్గర ట్రేడ్ అవుతోంది. కేజీ వెండి silver ధర రూ.1,10,800 దగ్గర ట్రేడ్ అవుతోంది.