అక్షరటుడే, వెబ్‌డెస్క్: Today Gold Prices | దేశీయంగా, అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరల్లో Silver Price చోటుచేసుకుంటున్న మార్పులు పెట్టుబడిదారులను ఆశ్చర్యపరుస్తున్నాయి.
కొన్ని రోజులుగా పసిడి ధరలు గణనీయంగా పెరిగినా, తర్వాత వరుసగా 10–15 రోజులపాటు భారీగా తగ్గిన సంగతి తెలిసిందే.
అంతర్జాతీయ మార్కెట్లో ఒక దశలో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 4,380 డాలర్ల గరిష్టాన్ని తాకగా, తరువాత ఒక్కసారిగా 400 డాలర్లకు పైగా క్షీణించి 4,000 డాలర్ల దిగువకు చేరింది. ఈ భారీ ఒడుదుడుకుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది.
Today Gold Prices | హెచ్చు తగ్గులు..
నాలుగైదు రోజుల క్రితం బంగారం ధరలు తగ్గుముఖం పట్టగా, రెండు రోజుల క్రితం ఒక్కసారిగా రూ.2,000 వరకు పెరిగి పెట్టుబడిదారులకు షాక్ ఇచ్చాయి.
అయితే నిన్న బంగారం ధర Gold Price మళ్లీ తగ్గి తులానికి సుమారు రూ.800 తగ్గింది. ఈరోజు ఉదయం (నవంబర్ 15)కి వచ్చేసరికి ధరల్లో మరోసారి తగ్గుదల నమోదై, తులానికి రూ.1,500 వరకు పడిపోయింది.
ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,27,030 వద్ద ట్రేడవుతోంది. వెండి ధరలు కూడా స్థిరంగా ఉండకుండా మార్పులతోనే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,73,200 గా ఉంది.
దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి:
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,180 , 22 క్యారెట్లకు రూ.1,16,590 గా ఉంది.
ముంబై, హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు Bangalore నగరాల్లో 24 క్యారెట్ బంగారం ధర రూ.1,27,030 , 22 క్యారెట్ బంగారం ధర రూ.1,16,440 గా ఒకే స్థాయిలో కొనసాగుతోంది.
చెన్నైలో మాత్రం ధరలు కొద్దిగా ఎక్కువగా ఉండి 24 క్యారెట్ల బంగారం రూ.1,28,060 , 22 క్యారెట్ల బంగారం రూ.1,17,390 వద్ద నమోదయ్యాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో ఆర్థిక అనిశ్చితి, డాలర్ బలహీనత, గ్లోబల్ కొనుగోలు ఒత్తిళ్ల ప్రభావం దేశీయ ధరలపై ప్రత్యక్షంగా పడిందని నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో కూడా బంగారం, వెండి ధరలు ఇదే తరహాలో హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశముందని వారు అంచనా వేస్తున్నారు.
