అక్షరటుడే, హైదరాబాద్: Today Gold Prices | బంగారం ధరలు Gold Prices మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల రూ.లక్షా 30 వేల మార్క్‌ను దాటి పరుగులు పెట్టిన పసిడి ధరలు ఇటీవల కొంతవరకు తగ్గినా, మళ్లీ ఎగబాకుతుండడం మనం గమనించవచ్చు.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం రేట్లు పెరుగుతుండడంతో దేశీయంగా కూడా ధరలు పెరగడానికి ప్రధాన కారణంగా బులియన్ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న ఆర్థిక, రాజకీయ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో తరచూ మార్పులు సంభవిస్తున్నాయి. ఒక్కోసారి భారీగా పెరిగితే మరికొన్ని సందర్భాల్లో తగ్గుతూ ఉండటం సాధారణమే.
Today Gold Prices | మళ్లీ పెరుగుదల..
మంగళవారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఒక్కరోజులోనే రూ.1,700 మేర ఎగబాకిన విషయం తెలిసిందే. అదే పెరుగుదల బుధవారం (నవంబర్ 26, 2025) కూడా కనిపించింది. దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.10 పెరిగి ₹1,27,050గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరిగి ₹1,16,460గా నమోదైంది. వెండి కిలో ధర రూ.100 పెరిగి ₹1,67,100కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే రేట్లు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో Hyderabad 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములు ₹1,27,050, 22 క్యారెట్లు ₹1,16,460గా ఉండగా, వెండి కిలో ధర ₹1,74,100గా ఉంది. విజయవాడ, విశాఖపట్నాల్లో కూడా ఇదే ధరలు నమోదయ్యాయి. ఇతర మెట్రోల్లో ధరలు భిన్నంగా ఉన్నాయి.
ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములు ₹1,27,200, 22 క్యారెట్లు ₹1,16,610గా, వెండి కిలో ₹1,67,100గా ఉంది. ముంబైలో 24 క్యారెట్లు ₹1,27,050, 22 క్యారెట్లు ₹1,16,460, వెండి కిలో ₹1,67,100గా ఉన్నాయి. చెన్నైలో Chennai మాత్రం 24 క్యారెట్ల బంగారం ధర ₹1,27,870, 22 క్యారెట్లు ₹1,17,210గా నమోదైంది. వెండి కిలో ₹1,74,100గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్లు ₹1,27,050, 22 క్యారెట్లు ₹1,16,460, వెండి కిలో ₹1,67,100గా ఉన్నాయి. నగరాలవారీగా బంగారం, వెండి రేట్లు వేర్వేరుగా ఉండటానికి స్థానిక డిమాండ్, సరఫరా, రాష్ట్ర పన్నులు, రవాణా ఖర్చులు వంటి అంశాలు ప్రభావం చూపుతాయి. అందుకే ప్రతి నగరంలో ధరల్లో వ్యత్యాసాలు కనిపిస్తాయి.