అక్షరటుడే, హైదరాబాద్: Today Gold Prices | దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు Silver Prices రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్నాయి. ఒక రోజు స్వల్పంగా తగ్గినా, మరుసటి రోజే కొత్త గరిష్ఠాలను తాకుతూ పెట్టుబడిదారులను ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా డిసెంబర్ 16న తులం బంగారం ధర రూ.1,35,390 వద్ద ట్రేడవుతుండగా, లక్షా 40 వేల మార్క్‌కు చేరువలో ఉంది.
వెండి ధర కూడా అదే బాటలో పరుగులు పెడుతూ కిలో రూ.2,03,100 స్థాయికి చేరింది. హైదరాబాద్‌లో అయితే కిలో వెండి రూ.2,15,100 వద్ద కొనసాగుతోంది.ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం, వెండి కొనాలంటేనే భయపడే రోజులు వచ్చాయని వినియోగదారులు అంటున్నారు. మరోవైపు 2026లో కూడా ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Today Gold Prices | రికార్డ్ ధరలు..
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు Gold Prices (10 గ్రాములు) ఎలా ఉన్నాయనేది చూస్తే..
- ఢిల్లీ: 24 క్యారెట్లు – రూ.1,35,540 : 22 క్యారెట్లు – రూ.1,24,260
- ముంబై: 24 క్యారెట్లు – రూ.1,35,390 : 22 క్యారెట్లు – రూ.1,24,110
- హైదరాబాద్: 24 క్యారెట్లు – రూ.1,35,390 : 22 క్యారెట్లు – రూ.1,24,110
- విజయవాడ: 24 క్యారెట్లు – రూ.1,35,390 : 22 క్యారెట్లు – రూ.1,24,110
- చెన్నై: 24 క్యారెట్లు – రూ.1,36,540 : 22 క్యారెట్లు – రూ.1,25,160
- బెంగళూరు: 24 క్యారెట్లు – రూ.1,35,390 : 22 క్యారెట్లు – రూ.1,24,110గా ట్రేడ్ అయింది.
ఈ ధరలు ఉదయం నమోదైనవిగా పేర్కొన్నారు. సాధారణంగా రోజూ ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యలో ధరలు అప్డేట్ అవుతాయని, అందువల్ల పెరుగుదల లేదా తగ్గుదల ఉండొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. బంగారం కొనుగోలు చేసే ముందు తాజా ధరలను నిర్ధారించుకోవడంతో పాటు, హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరిగా పరిశీలించి నగలు Jewellery కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు మరింత ఎగబాకడంతో పాటు రూపాయి క్షీణత ధరలు పెరుగుదలకి ప్రధాన కారణమని బులియన్ విశ్లేషకులు తెలిపారు