Homeతాజావార్తలుToday Gold Prices | మ‌హిళ‌లకి శుభ‌వార్త‌.. మ‌రింత త‌గ్గిన బంగారం ధ‌ర..!

Today Gold Prices | మ‌హిళ‌లకి శుభ‌వార్త‌.. మ‌రింత త‌గ్గిన బంగారం ధ‌ర..!

Today Gold Prices | పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల దిశగా అడుగులు వేస్తుండటంతో ఇటీవల గరిష్టాలను తాకిన బంగారం ధర.. ఇప్పుడు క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. నవంబరు 19న దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: Today Gold Prices | గత కొద్ది రోజులుగా ఎగబాకుతూ వచ్చిన బంగారం ధరలు Gold Prices ఇప్పుడు నెమ్మదిగా దిగుతూ వ‌స్తున్నాయి.

పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులపై ఆసక్తి చూపడం వల్ల మొన్నటి వరకు బంగారం రేట్లు గరిష్టాలను తాకినా, ప్రస్తుతం మార్కెట్‌లో డిమాండ్ సమతౌల్యం ఏర్పడటంతో ధరలు కొద్దిగా శాంతించాయి.

ఈ నేపథ్యంలో నవంబరు 19న దేశీయ బంగారం ధరల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,23,650 కాగా, 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,13,340 వద్ద నమోదైంది.

Today Gold Prices | క్ర‌మేపి త‌గ్గుద‌ల‌..

  • ఢిల్లీలో Delhi మాత్రం 24 క్యారెట్ రేటు రూ. 1,23,800, 22 క్యారెట్ రేటు రూ. 1,13,490గా ఉంది.
  • హైదరాబాద్‌, విజయవాడ Vijayawada, ముంబయి Mumbai, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, కేరళ Kerala, పుణె Pune వంటి ప్రధాన నగరాల్లో ధరలు దాదాపు ఒకే స్థాయిలో కొనసాగుతున్నాయి.
  • వడోదరలో 24 క్యారెట్ ధర రూ. 1,23,700, 22 క్యారెట్ ధర రూ. 1,13,390గా ఉంది.

మరోవైపు వెండి ధరలు నిన్నటితో పోల్చితే పెద్దగా మార్పు లేకుండా స్థిరంగా ఉండటం గమనార్హం. హైదరాబాద్‌, విజయవాడ, చెన్నై, కేరళల్లో వెండి కేజీ ధర రూ. 1,69,900గా ఉండగా.. ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, వడోదర, అహ్మదాబాద్‌ వంటి నగరాల్లో రూ. 1,61,900గా నమోదు అయ్యింది.

మొత్తం మీద దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు Silver Prices స్వల్ప తేడాలతో ఉన్నప్పటికీ మార్కెట్ మొత్తం స్థిరీకరణ దశలో కొనసాగుతుండటం పెట్టుబడిదారులకు కీలక సూచనగా భావించవచ్చు.

అయితే ఒక్కోసారి ధ‌ర‌లు ప్రాంతాన్ని బ‌ట్టి, స‌మ‌యాన్ని బ‌ట్టి కూడా మారుతూ ఉంటాయి. ప్ర‌స్తుతం బంగారం ధ‌ర‌ల‌లో కాస్త త‌గ్గుద‌ల క‌నిపిస్తుంది. కాబ‌ట్టి, ఆస‌క్తి ఉన్నవారు ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా కొనుగోలు చేయ‌డం మంచిది.