అక్షరటుడే, హైదరాబాద్: Today Gold Prices | బంగారం కొనుగోలుపై నిర్ణయం తీసుకునే ముందు తాజా ధరలు తెలుసుకుని, ప్రామాణిక జువెల్లర్ల వద్ద పరిశీలించి కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మేకింగ్ ఛార్జీలు, పన్నులు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
దేశంలో బంగారం ధరలు Gold Rates రోజురోజుకు పెరుగుతూ ఆల్ టైం హైకి చేరుకున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు, పెట్టుబడిదారుల ఆందోళనలు, రూపాయి విలువ పతనం వంటి పరిణామాలు బంగారం డిమాండ్‌ను గణనీయంగా పెంచుతున్నాయి.
ముఖ్యంగా భౌగోళిక రాజకీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, అమెరికా-ఇజ్రాయెల్–హమాస్ యుద్ధ వాతావరణం, డాలరు బలపడటం నేపథ్యంలో బంగారం పెట్టుబడిదారులకి సురక్షిత ఆశ్రయంగా మార్చాయి.
ఈ ప్రభావం భారత్‌లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అక్టోబరు 11న 24 క్యారెట్ల బంగారం 24 carat gold rate ధర 10 గ్రాములకు రూ. 1,23,700కి చేరింది. ఇదే సమయంలో 22 క్యారెట్ల (22 carat) పది గ్రాముల బంగారం ధర రూ. 1,13,390గా నమోదైంది.
Today Gold Prices | మహిళలకి గుడ్ న్యూస్..
వెండి ధరల Silver Rates విషయానికొస్తే, నిన్నటితో పోల్చితే ఇవాళ రూ.100 మేర పెరిగినట్లు కనిపిస్తోంది. వెండి ధరలు కూడా అంతర్జాతీయ మార్కెట్లపై ఆధారపడి ఉండటంతో, డాలరు బలపడటం, సరఫరాలో అంతరాయం వంటి అంశాలు వీటి పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి.
ప్రస్తుతం 1 కిలో వెండి silver ధర సగటున రూ. 1,84,100 దగ్గర ట్రేడ్ అవుతోంది. ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు అనేకం ఉన్నాయి.
భౌగోళికంగా చోటుచేసుకుంటున్న ఉద్రిక్తతలు, ఆర్థిక మార్కెట్లలో తిరోగమనం, రూపాయి బలహీనత, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై స్పష్టత లేకపోవడం వంటి అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి.
పండుగల సీజన్ కావడంతో ఆభరణాల కొనుగోలు పెరుగుతున్న సందర్భంలో వినియోగదారులు కొనుగోలు చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు. దేశంలోని ప్రధాన నగరాలలో బంగారం ధరలు విషయానికి వస్తే..
24 క్యారెట్ల బంగారం ధరలు పది గ్రాములకు హైదరాబాద్, విజయవాడ, ముంబయి, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, కేరళ, పుణెలో Pune రూ. 1,23,700గా నమోదు అయింది. 22 క్యారెట్ల ధర రూ. 1,13,390గా ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,23,850గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,13,540గా ఉంది. వడోదరలో వరుసగా రూ. 1,23,750 – రూ. 1,13,440గా ఉండగా, మిగతా నగరాల్లో ధరలు సమానంగా నమోదయ్యాయి. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి.
హైదరాబాద్, విజయవాడ, చెన్నై, కేరళలో వెండి ధర కిలోకు రూ. 1,84,100గా ఉంది. ఢిల్లీ, కోల్‌కతా, ముంబయి, బెంగళూరు, వడోదర, అహ్మదాబాద్‌లలో వెండి ధర రూ. 1,74,100గా ఉంది. ధరల పెరుగుదల నేపథ్యంలో వినియోగదారులు కొనుగోళ్ల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.