అక్షరటుడే, హైదరాబాద్: Today Gold Prices | దీపావళి సమీపిస్తున్న వేళ బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయని వారణాసి సరాఫా అసోసియేషన్ అధ్యక్షుడు సంతోష్ కుమార్ అగర్వాల్ తెలిపారు.
నిరంతరం ఎగబాకుతున్న ఈ ధరలు వినియోగదారులు, వ్యాపారులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ధంతేరస్‌కు ముందు బంగారం ధర Gold Prices లు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.
పండుగ సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో బులియన్ మార్కెట్లో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్క రోజే బంగారం ధర రూ.2 వేలకుపైగా ఎగబాకింది.
రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
తాజా ధరల ప్రకారం అక్టోబరు 14న దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (24 carat gold) ధర రూ.1,25,410గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర (22 carat gold) రూ.1,14,960గా నమోదైంది. వెండి ధరలు కూడా అదే స్థాయిలో పరుగులు పెడుతున్నాయి.
Today Gold Prices | పెరుగుతున్న ధరలు..
దేశవ్యాప్తంగా కిలో వెండి ధర రూ.1,85,100 ఉండగా, హైదరాబాద్‌లో కిలో వెండి Silver రూ.1,97,100కు చేరి రూ. రెండు లక్షల మార్క్‌ను తాకే దిశగా పోతోంది. ఇక ప్రధాన నగరాల్లో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి.
ఢిల్లీ (Delhi) లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,560 , 22 క్యారెట్ల glod రూ.1,15,110 గా కొనసాగుతోంది.
ముంబయి, హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,25,410 , 22 క్యారెట్ల gold రూ.1,14,960గా కొనసాగుతోంది.
చెన్నైలో మాత్రం 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,26,340 , 22 క్యారెట్ల gold రూ.1,15,810గా ఉంది. దీపావళి సీజన్‌కు ముందు ఇలాంటి భారీ పెరుగుదల కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తోంది.
వారణాసి Varanasi సరాఫా అసోసియేషన్ అధ్యక్షుడు సంతోష్ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ, ఈ ఏడాది బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయని తెలిపారు. 2020–21లో కిలో వెండి ధర రూ.60,000గా ఉండగా, ప్రస్తుతం రూ.1.85 లక్షలకు ఎగబాకిందని అన్నారు.
దీపావళి, వివాహ సీజన్ నేపథ్యంలో ఈ పెరుగుదల మరింత కొనసాగవచ్చన్నారు. బంగారం ధరలు నిరంతరం పెరుగుతుండటంతో మధ్యతరగతి ప్రజలు వెండి ఆభరణాలపై దృష్టి సారిస్తున్నారని, అయితే వెండి కూడా రికార్డు స్థాయికి చేరడంతో సామాన్యులు కృత్రిమ ఆభరణాలతో సరిపెట్టుకునే పరిస్థితి నెలకొంటోందని ఆయన పేర్కొన్నారు.