అక్షరటుడే, వెబ్‌డెస్క్: Today Gold Prices : గత కొద్ది రోజులుగా బంగారం ధర Gold Prices పరుగులు పెడుతోంది. పండగ సీజన్‌లో ఇలా బంగారం ధరలకి రెక్కలు రావడంతో సామాన్యులు ఉలిక్కిపడుతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు సరికొత్త రికార్డ్ నమోదు చేశాయి. మరోవైపు, దేశ ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ కూడా విపరీతంగా పెరగడంతో బంగారం ధరలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి.
ఇప్పట్లో ధరలు తగ్గేలా కనిపించడం లేదు. ట్రంప్ సుంకాల కారణంగా పెట్టుబడిదారులలో అనిశ్చితి వాతావరణం ఏర్పడటంతో చాలా మంది సురక్షితమైన మార్గాన్ని ఎంచుకుంటున్నారు.
మరోవైపు ఫెడ్ Fed కూడా వడ్డీ రేట్లను తగ్గించాలని భావిస్తున్న నేపథ్యంలో బంగారం ధరలు పైపైకి పోతున్నాయి.
ఈ రోజు (సెప్టెంబర్ 4న) 24 క్యారెట్ల 24 carat gold పది గ్రాముల బంగారం ధర 1,06,980 కి చేరుకోగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 98,060 గా నమోదైంది.
Today Gold Prices : తగ్గేలా లేవుగా..
ఢిల్లీ Delhi మార్కెట్లలో బంగారం ధరలు 10 గ్రాములకు రూ. 1,000 పెరిగి సరికొత్త రికార్డు సృష్టించింది అని చెప్పాలి. ప్రస్తుతం తులం ధర రూ. 1,07,070గా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్) ధరలు ఎలా ఉన్నాయనేది చూస్తే..
- హైదరాబాద్ Hyderabad లో రూ. 1,06,980 – రూ. 98,060
- విజయవాడ Vijayawada లో రూ. 1,06,980 – రూ.98,060
- ఢిల్లీ Delhi లో రూ.1,07,130 – రూ.98,210
- ముంబయి Mumbai లో రూ.1,06,980 – రూ.98,060
- వడోదర Vadodara లో రూ.1,07,030 – రూ.98,110
- కోల్‌కతా Kolkata లో రూ.1,06,980 – రూ.98,060
- చెన్నై Chennai లో రూ.1,06,980 – రూ.98,060
- బెంగళూరు Bengaluru లో రూ.1,06,980 – రూ.98,060
- కేరళ Kerala లో రూ.1,06,980 – రూ.98,060
- పుణె Pune లో రూ.1,06,980 – రూ.98,060 గా ట్రేడ్ అయింది.
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి) Silver Prices చూస్తే..
- హైదరాబాద్‌లో రూ. 1,37,100
- విజయవాడలో రూ. 1,37,100 గా
- ఢిల్లీలో రూ. 1,27,100
- చెన్నైలో రూ. 1,37,100
- కోల్‌కతాలో రూ. 1,27,100
- కేరళలో రూ. 1,37,100 ముంబయిలో రూ. 1,27,100
- బెంగళూరులో రూ. 1,27,100
- వడోదరలో రూ. 1,27,100
- అహ్మదాబాద్‌లో రూ. 1,27,100గా ట్రేడ్ అయ్యాయి.
బంగారం ధర ఇటీవలి కాలంలో వరుసగా 80వ రోజు పెరగడం గమనార్హం.