అక్షరటుడే, హైదరాబాద్: Today Gold Prices | బంగారం, వెండి ధరలు Silver Prices రోజురోజుకూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఒక రోజు స్వల్పంగా తగ్గినట్లు కనిపించినా, మరుసటి రోజే అంతకంటే రెండింతల వేగంతో పెరుగుతూ సామాన్యుడికి షాక్ ఇస్తున్నాయి. ఒకప్పుడు తులం బంగారం ధర రూ.70 వేల నుంచి రూ.80 వేల మధ్యలో ఉండగా, ప్రస్తుతం అది రెట్టింపు స్థాయికి చేరింది. ఇటీవల వరకు లక్షా 20 వేల లోపే ఉన్న తులం ధర, ఇప్పుడు ఏకంగా లక్షా 35 వేల వరకు చేరింది. డిసెంబర్ 20 నాటికి దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,170గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,22,990గా కొనసాగుతోంది. వెండి పరిస్థితి కూడా అంతే తీవ్రంగా ఉంది.
Today Gold Prices | పైపైకి పోతున్న బంగారం ధరలు..
ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,08,900గా ఉండగా, హైదరాబాద్, చెన్నై, కేరళ వంటి ప్రాంతాల్లో ఇది రూ.2,20,900 వరకు చేరింది. ప్రధాన నగరాల్లోనూ బంగారం ధరలు భారీగానే ఉన్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,34,320గా, 22 క్యారెట్ల ధర రూ.1,23,140గా ఉంది. ముంబై, హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, కేరళలో Kerala 24 క్యారెట్ల బంగారం రూ.1,34,170గా, 22 క్యారెట్ల బంగారం రూ.1,22,900గా కొనసాగుతోంది. చెన్నైలో మాత్రం ధరలు మరింత ఎక్కువగా ఉండి, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,35,050గా, 22 క్యారెట్ల ధర రూ.1,23,790గా నమోదైంది.
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ Marriage season ప్రారంభం కావడంతో బంగారం, వెండి కొనుగోళ్లకు డిమాండ్ పెరిగింది. వ్యక్తిగత అవసరాలు, భవిష్యత్తు భద్రత కోసం చాలామంది ఈ విలువైన లోహాలపై పెట్టుబడులు పెడుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కొనుగోలు చేయాలనుకునే వారు రోజువారీ ధరలను తప్పనిసరిగా పరిశీలించి, ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.