Homeతాజావార్తలుToday Gold Prices | మ‌ళ్లీ పెరిగిన ప‌సిడి ధ‌ర‌.. తెలుగు రాష్ట్రాల‌లో ఎంత ఉందంటే..!

Today Gold Prices | మ‌ళ్లీ పెరిగిన ప‌సిడి ధ‌ర‌.. తెలుగు రాష్ట్రాల‌లో ఎంత ఉందంటే..!

అక్షరటుడే, హైదరాబాద్​: దేశంలో బంగారం ధర Gold Price రోజు రోజుకు పెరుగుతూ పోతోంది. గతంలో ఎన్నడూ లేని రికార్డుల్ని కొల్లగొడుతోంది.

సెప్టెంబరు 27, 2025, శనివారం నమోదైన ధరల ప్రకారం 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.10 పెరిగి రూ.1,14,890కి చేరింది. అలాగే 22 క్యారెట్ల పది గ్రాముల ధర కూడా రూ.10 పెరిగి రూ.1,05,310కి చేరుకుంది.

పెరుగుతున్న ధరల నేపథ్యంలో సాధారణ ప్రజలు బంగారం కొనుగోలుకు వెనుకంజ వేస్తున్నారు. పసిడి ధరలు ఇలా పెరుగుతుండటానికి కారణం అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిస్థితులే.

డాలరు బలపడటం, జియోపాలిటికల్ ఉద్రిక్తతలు, ఇన్వెస్టర్ల ఆసక్తి వంటి కారణాలతో బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి.

Today Gold Prices | స్వ‌ల్ప పెరుగుద‌ల‌..

ఇదే సమయంలో వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం వెండి Silver కిలో ధర రూ.100 పెరిగి రూ.1,43,100కి చేరింది.

అయితే దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు. మార్కెట్ పరిస్థితులను బట్టి ఈ ధరలు ఎప్పుడైనా మారవచ్చు.

అందువల్ల కొనుగోలుదారులు అధికారిక జ్యువెల్లరీ అసోసియేషన్ వెబ్‌సైట్ లేదా స్థానిక బంగారు దుకాణాల్లో ధరలు చెక్ చేసుకోవడం మంచిది. ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయ‌నేది చూస్తే..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,14,890గా న‌మోదు కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,05,310గా ట్రేడ్ అయింది. ఇక‌ కిలో వెండి ధర రూ.1,53,100 గా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,14,890 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,05,310 , కిలో వెండి ధర రూ.1,53,100 గా ట్రేడ్ అయింది.

ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,15,040, 22 క్యారెట్ల ధర రూ.1,05,460గా ట్రేడ్ కాగా కిలో వెండి ధర రూ.1,43,100గా న‌మోదైంది.

ముంబయిలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,14,890, 22 క్యారెట్ల ధర రూ.1,05,310 గా న‌మోదు కాగా, వెండి ధర కిలో రూ.1,43,100గా ట్రేడ్ అయింది.

చెన్నైలో Chennai 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,15,100 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,05,510 గా ట్రేడ్ అయింది. వెండి ధర కిలో రూ.1,53,100గా న‌మోదైంది.

బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,14,890, 22 క్యారెట్ల ధర రూ.1,05,310 గా న‌మోదు కాగా, వెండి ధర కిలో రూ.1,42,500గా ట్రేడ్ అయింది.

Must Read
Related News