అక్షరటుడే, హైదరాబాద్: Today Gold Prices | భారతీయ మహిళలకు బంగారం Gold అంటే ప్రత్యేక మక్కువ. పండుగలు, వివాహాలు, ఇతర శుభకార్యాల సందర్భాలలో బంగారు ఆభరణాలను కొనుగోలు చేసి అలంకరించుకోవడం ఓ సంప్రదాయంగా మారిపోయింది.
ఈ వేళల్లో బంగారం ధరించడం కేవలం అందాన్ని కాదు, ఆధ్యాత్మికతను, సంపదను పెంచుతుందన్న విశ్వాసం కూడా ఉంది.
భౌగోళిక, ఆర్థిక పరిస్థితుల అస్థిరత మధ్య పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతుండటంతో బంగారం ధరలు Gold Price దేశవ్యాప్తంగా రోజురోజుకీ పెరుగుతూ కొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి.
డాలరుతో పోల్చితే రూపాయి విలువ క్షీణించడం, అంతర్జాతీయ మార్కెట్లో మారకం విలువ పెరగడం వంటి అంశాలు కూడా బంగారం విలువను ప్రభావితం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అక్టోబరు 5న 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,19,400 కు చేరగా, 22 క్యారెట్ల ధర రూ. 1,09,450 గా నమోదైంది.
Today Gold Prices | పైపైకి పోతున్న ధరలు..
- దేశ రాజధాని ఢిల్లీలో Delhi 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,19,550 కి పెరగగా, 22 క్యారెట్ల ధర రూ. 1,09,600 కు చేరుకుంది.
- హైదరాబాద్ Hyderabad, విజయవాడ Vijayawada, ముంబయి Mumbai, చెన్నై Chennai, కోల్‌కతా Kolkata, బెంగళూరు Bengaluru, పుణె Pune, కేరళ Kerala వంటి ఇతర ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల ధర రూ. 1,19,400 , 22 క్యారెట్ల ధర రూ. 1,09,450 గా ఉంది.
- వడోదరలో మాత్రం కొద్దిగా వ్యత్యాసంగా 24 క్యారెట్ల ధర రూ. 1,19,450 కాగా, 22 క్యారెట్ల ధర రూ. 1,09,500 గా ఉంది.
ఇక వెండి ధరలను పరిశీలిస్తే.. గతంతో పోల్చితే స్వల్పంగా తగ్గుదల కనిపించింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, కేరళలో వెండి ధర కిలోకు రూ. 1,65,000 గా ఉండగా.. ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, వడోదర, అహ్మదాబాద్‌లలో రూ. 1,55,000 గా ఉంది.
ఈ స్థాయిలో ధరలు పెరగడమే కాక, మార్కెట్‌లో కొనసాగుతున్న అనిశ్చితి కారణంగా పసిడి, వెండి Silver వంటి విలువైన లోహాలపై డిమాండ్ మరింతగా పెరగవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కొనుగోలుదారులపై భారం పెంచే అవకాశం ఉన్నప్పటికీ, పెట్టుబడిదారులకు ఇది మంచి అవకాశంగా మారొచ్చు.