అక్షరటుడే, హైదరాబాద్: Today Gold Prices | ఇటీవలి కాలంలో నిరంతరంగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు Gold Rates ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.
అంతర్జాతీయంగా international బంగారం ఔన్స్ ధరలు తగ్గడంతో దేశీయ మార్కెట్లో కూడా పసిడి రేట్లు పడిపోతున్నాయి. ఈ ప్రభావంతో అక్టోబరు 25న దేశవ్యాప్తంగా బంగారం gold ధరల్లో మరోసారి స్వల్ప తగ్గుదల నమోదైంది.
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ. 1,24,360 కొనసాగగా.. 22 క్యారెట్ల పది గ్రాముల ధర రూ. 1,13,990 పలుకుతోంది. వెండి ధరల్లో కూడా స్వల్పంగా క్షీణత కనిపించింది. కిలో వెండి ధర నిన్నటితో పోలిస్తే రూ. 100 మేర తగ్గింది.
Today Gold Prices | స్వల్ప తగ్గుదల..
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,24,510 గా, 22 క్యారెట్ల ధర రూ. 1,14,140 గా నమోదైంది.
హైదరాబాద్, విజయవాడ, చెన్నై, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, కేరళ, పుణెలో 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ. 1,24,360 గా, 22 క్యారెట్ల ధర రూ. 1,13,990 గా కొనసాగుతోంది.
వడోదరలో 24 క్యారెట్ల బంగారం (24 carat Gold) ధర రూ. 1,24,410, 22 క్యారెట్ల (22 carat gold) ధర రూ. 1,14,040గా ఉంది.వెండి ధరలు కూడా ప్రధాన నగరాల్లో స్వల్పంగా తగ్గాయి.
హైదరాబాద్, విజయవాడ, చెన్నై, కేరళల్లో కిలో వెండి ధర రూ. 1,69,900గా ఉంది. ఇక ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, వడోదర, అహ్మదాబాద్‌లలో వెండి ధర Silver Price కిలోకు రూ. 1,54,900గా నమోదైంది.
ఆర్థిక నిపుణుల విశ్లేషణ ప్రకారం, అంతర్జాతీయ బంగారం మార్కెట్లో డాలర్ విలువ పెరగడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకున్న తాజా నిర్ణయాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి.
అయితే, పండుగ సీజన్ కారణంగా దేశీయంగా బంగారంపై డిమాండ్ స్థిరంగా కొనసాగుతుందని వారు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పసిడి ధరలు తగ్గినా, నిపుణులు దీన్ని తాత్కాలిక మార్పుగా పేర్కొంటూ, నవంబరు November మొదటి వారానికి మళ్లీ ధరలు పెరగవచ్చని చెబుతున్నారు.
ఇటీవల ధరలు అమాంతం పెరుగుతూ పోతుండడంతో సామాన్యులు అటు వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. రానున్న రోజులలో బంగారం ధరలు రూ. లక్షా 50 వేల రూపాయలకి చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు.
