అక్షరటుడే, హైదరాబాద్: Today Gold Prices | బంగారం ధరలు Gold Price ఈ మధ్య భారీగా పెరగగా, ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుదల నమోదైంది. శుక్రవారం బంగారం ధర స్వల్పంగా దిగి వచ్చింది.
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,25,070గా ఉండగా, గురువారం ఇది రూ.1,25,080గా నమోదైంది. అంటే రూ.10 మేర తగ్గింది. అదే విధంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,14,640గా ఉంది. నిన్న ఇదే ధర రూ.1,14,650గా ఉండటంతో చిన్న మార్పు నమోదైంది.
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,26,020 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,14,790గా ఉంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,25,070గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,14,640గా కొనసాగుతోంది.
Today Gold Prices | స్వల్ప తగ్గుదల..
ఇవే రేట్లు ఈ మూడు నగరాల్లో సమానంగా ఉన్నాయి. దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా బంగారం ధరలు పెద్దగా మార్పు లేకుండా స్థిరంగా ఉన్నాయి.
ఢిల్లీలో 24 క్యారెట్ బంగారం (24 carat gold) ధర రూ.1,26,020, 22 క్యారెట్ (22 carat gold) రూ.1,14,790గా ఉండగా, ముంబయి Mumbai లో రూ.1,25,070, రూ.1,14,640గా ఉన్నాయి.
- వడోదరలో రూ. 1,25,120 – రూ. 1,14,690
- కోల్‌కతాలో రూ. 1,25,070 – రూ. 1,14,640
- చెన్నైలో రూ. 1,25,450 – రూ. 1,19,690
- బెంగళూరులో రూ. 1,25,070 – రూ. 1,14,690
- కేరళలో రూ. 1,25,070 – రూ. 1,14,690
- పుణెలో రూ. 1,25,070 – రూ. 1,19,640
విశ్లేషకుల ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ, వడ్డీ రేట్లు, అమెరికా ఆర్థిక పరిస్థితులు వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి.
రాబోయే వారాల్లో ధరల్లో స్వల్ప మార్పులు కొనసాగే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. మొత్తంగా ప్రస్తుతం బంగారం ధరలు స్వల్పంగా తగ్గినా, పండుగ సీజన్ దృష్ట్యా డిమాండ్ స్థిరంగా కొనసాగుతోంది.
బంగారంతో పాటు వెండి ధరలు కూడా ఇటీవల భారీగా తగ్గిన విషయం తెలిసిందే. అయితే, ఈరోజు వెండి రేట్లు Silver Rates స్థిరంగా కొనసాగుతున్నాయి.
హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.1,75,000 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో బెంగళూరు, ఢిల్లీ, ముంబయి వంటి ప్రధాన నగరాల్లో వెండి రేటు కిలోకు రూ.1,59,000గా ఉంది.
పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు అక్టోబరు 24వ తేదీ శుక్రవారం ఉదయం నమోదైనవి. అయితే, రోజంతా మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ధరలు మారే అవకాశం ఉంటుంది. కాబట్టి కొనుగోలు చేసేముందు స్థానిక మార్కెట్‌లోని తాజా రేట్లు తెలుసుకోవడం మంచిది.
