Homeబిజినెస్​Today Gold Prices | మ‌రింత త‌గ్గిన బంగారం ధ‌ర‌.. నేడు ఎంతంటే..!

Today Gold Prices | మ‌రింత త‌గ్గిన బంగారం ధ‌ర‌.. నేడు ఎంతంటే..!

Today Gold Prices | బంగారం, వెండి ధరలు రోజు వారీగా మారే అవకాశముంది. మార్కెట్ పరిస్థితులు, అంతర్జాతీయ మారక విలువలు, డాలర్ స్థాయిలు, ఆర్థిక పరిస్థితుల ఆధారంగా వీటిలో మార్పులు చోటుచేసుకుంటాయి.

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: Today Gold Prices | బంగారం (gold), వెండి (silver) ధరలు రోజు వారీగా మారే అవకాశముంది. మార్కెట్ పరిస్థితులు, అంతర్జాతీయ మారక విలువలు, డాలర్ స్థాయిలు, ఆర్థిక పరిస్థితుల ఆధారంగా వీటిలో మార్పులు చోటుచేసుకుంటాయి.

ఇటీవలి కాలంలో బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతూ సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ఔన్స్ ధర తగ్గడంతో దేశీయంగా కూడా పసిడి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి.

గ్లోబల్ మార్కెట్లలో డాలర్ బలపడటం, యూఎస్ బాండ్‌ యీల్డ్స్ పెరగడం, పెట్టుబడిదారులు జాగ్రత్త వైఖరి అవలంబించడం వంటి కారణాలతో గోల్డ్ రేట్లు పడిపోతున్నాయి.

ఈ ప్రభావం భారత బులియన్ మార్కెట్‌పై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 23న దేశవ్యాప్తంగా బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి.

తాజా రేట్ల ప్రకారం.. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,25,880కి చేరగా, 22 క్యారెట్ల (22 carat gold) పది గ్రాముల ధర రూ. 1,15,390గా నమోదైంది. బంగారం ధరల్లో ఈ తగ్గుదల పండుగ సీజన్‌లో వినియోగదారులకు కొంత ఊరట కలిగిస్తోంది.

Today Gold Prices | శాంతించిన బంగారం..

  • దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ. 1,26,030గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 1,15,540గా ఉంది.
  • హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,25,880గా, 22 క్యారెట్ల ధర రూ. 1,15,390గా నమోదైంది.
  • ముంబయి, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో కూడా ఇదే రేంజ్‌లో ధరలు కొనసాగుతున్నాయి.
  • వడోదర Vadodara లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,25,930 కాగా, 22 క్యారెట్ల ధర రూ. 1,15,440గా ఉంది.
  • పుణె, కేరళ, బెంగళూరు Bengaluru వంటి నగరాల్లో 24 క్యారెట్ల (24 carat gold) ధర రూ. 1,25,880, 22 క్యారెట్ల ధర రూ. 1,15,390గా నమోదైంది.

మొత్తం మీద దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఒక్కరోజులో సగటున రూ. 300 నుంచి రూ. 500 వరకు తగ్గినట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. నిన్నటితో పోల్చితే కిలోకు సుమారు రూ. 100 మేర తగ్గాయి. హైదరాబాద్‌, విజయవాడ, చెన్నై ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ. 1,74,900గా ఉంది.

ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, వడోదర, అహ్మదాబాద్ నగరాల్లో కిలో వెండి ధర రూ. 1,59,900గా నమోదైంది. కేరళలో మాత్రం వెండి ధర కొంచెం ఎక్కువగా రూ. 1,79,900కి చేరుకుంది.

మొత్తం మీద అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం కారణంగా భారత మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. అయితే ఈ ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయని, కొనుగోలు చేసే ముందు తాజా రేట్లు తప్పనిసరిగా తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Must Read
Related News