Homeతాజావార్తలుToday Gold Prices | స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌.. తెలుగు రాష్ట్రాల‌లో పరిస్థితి ఏమిటంటే..

Today Gold Prices | స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌.. తెలుగు రాష్ట్రాల‌లో పరిస్థితి ఏమిటంటే..

Today Gold Prices | ప్రస్తుతం బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్లపై భవిష్యత్ నిర్ణయాలు, అంతర్జాతీయ మార్కెట్లలో జియోపొలిటికల్ అభివృద్ధులు, అమెరికన్ డాలర్ బలహీనత లేదా బలపడటం వంటి అంశాలు రాబోయే రోజుల్లో ఈ విలువైన లోహాల ధరలపై ప్రభావం చూపే అవకాశముంది.

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: Today Gold Prices | భౌగోళిక రాజకీయ పరిస్థితుల ప్రభావంతో బంగారం ధరల్లో Gold Prices గత కొన్ని రోజులుగా స్వల్ప మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు, ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల Fed Reserve interest rates పై స్పష్టత లేకపోవడం, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడం వంటి అంశాల కారణంగా బంగారానికి డిమాండ్ కొంత మేర తగ్గింది.

ఫలితంగా, భారత్‌లో నాలుగు రోజులుగా 24 క్యారెట్ గోల్డ్ ధర రూ.1.22 లక్షల నుంచి రూ.1.23 లక్షల మధ్య కదలాడుతోంది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, దేశంలో బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే శనివారం ఉదయం స్వల్పంగా తగ్గాయి.

Today Gold Prices | స్థిరంగా ధ‌ర‌లు..

24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,010గా ఉండగా, 22 క్యారెట్ బంగారం ధర రూ.1,11,840కు చేరింది. ఇక వెండి ధర కూడా కొంచెం తగ్గుదల కనబరుస్తోంది.

నిన్నటితో పోలిస్తే కిలో వెండి ధర రూ.100 మేర తగ్గి రూ.1,52,400 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ 24 క్యారెట్ బంగారం ధర సుమారు 4,000 డాలర్ల Dollars వద్ద కొనసాగుతోంది.

ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో పెద్దగా మార్పులు కనిపించకపోవడంతో, నేటికీ బంగారం ధరలు దాదాపు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..

  • చెన్నైలో 24 క్యారెట్ బంగారం 10 గ్రాములకు రూ. 1,22,940 , 22 క్యారెట్ రూ. 1,12,690 , 18 క్యారెట్ రూ. 93,990గా ఉన్నాయి.
  • ముంబై, హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, కోల్‌కతా, పూణె, కేరళలో 24 క్యారెట్ రూ. 1,22,010, 22 క్యారెట్ రూ. 1,11,840 , 18 క్యారెట్ రూ. 91,510గా నమోదయ్యాయి.
  • ఢిల్లీలో Delhi 24 క్యారెట్ రూ. 1,22,160 , 22 క్యారెట్ రూ. 1,11,990 , 18 క్యారెట్ రూ. 91,660గా ఉండగా..
  • వడోదరా, అహ్మదాబాద్‌లో 24 క్యారెట్ రూ. 1,22,060 , 22 క్యారెట్ రూ. 1,11,890 , 18 క్యారెట్ రూ. 91,560గా ఉన్నాయి.

వెండి ధరలు కూడా నగరాలవారీగా మారుతూ కనిపిస్తున్నాయి. చెన్నై, హైదరాబాద్, విజయవాడ, కేరళలో కిలో వెండి ధర రూ.1,64,900గా ఉండగా..

  • ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, పూణె, వడోదరా, అహ్మదాబాద్‌లలో రూ.1,52,400 వద్ద కొనసాగుతోంది.
Must Read
Related News