Homeతాజావార్తలుToday Gold Prices | కాస్త శాంతించిన బంగారం ధ‌ర‌.. తెలుగు రాష్ట్రాల‌లో పరిస్థితి ఏమిటంటే..!

Today Gold Prices | కాస్త శాంతించిన బంగారం ధ‌ర‌.. తెలుగు రాష్ట్రాల‌లో పరిస్థితి ఏమిటంటే..!

Today Gold Prices | బంగారం ధరలు స్వల్పంగా తగ్గినప్పటికీ వెండి ధరల్లో పెరుగుదల నమోదు కావడం గమనార్హం. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి దేశీయ బంగారం, వెండి రేట్లలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: Today Gold Prices | దేశవ్యాప్తంగా బంగారం ధరల్లో Gold Rates నేడు స్వల్ప తగ్గుదల నమోదైంది.

ప్రపంచ మార్కెట్లలో మారుతున్న పరిస్థితులు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై ఉన్న అంచనాలు, డాలర్ బలపడటం, అలాగే అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడటం వంటి అంశాలు ఈ ప్రభావానికి కారణంగా కనిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారంపై పెట్టుబడులను తగ్గించడంతో దేశీయ మార్కెట్‌లో పసిడి ధరలు స్వల్పంగా పడిపోయాయి.

గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నవంబరు 2న 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం (24 carat gold) ధర నిన్నటితో పోలిస్తే స్వల్పంగా తగ్గి రూ. 1,23,000కు చేరింది. 22 క్యారెట్ గోల్డ్ (22 carat gold) ధర రూ. 1,12,750గా ఉంది.

Today Gold Prices | కొంత ఉప‌శ‌మ‌నం..

మరోవైపు వెండి ధర మాత్రం పెరుగుదల దిశగా పయనించింది. కిలో వెండి ధర రూ. 2,000 మేర పెరిగి రూ. 1,52,000 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌, విజయవాడ నగరాల్లో బంగారం ధరలు దేశవ్యాప్తంగా ఉన్న స్థాయిలకే సమానంగా ఉండగా, అక్కడ కిలో వెండి ధర రూ. 1.66 లక్షలుగా నమోదైంది.

ప్రధాన నగరాల్లో పసిడి ధరలను పరిశీలిస్తే – చెన్నైలో Chennai 24 క్యారెట్ బంగారం రూ. 1,23,380 , 22 క్యారెట్ రూ. 1,13,100 , 18 క్యారెట్ రూ. 94,350గా ఉంది.

  • ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌, కేరళ, పుణె pune నగరాల్లో 24 క్యారెట్ బంగారం ధర రూ. 1,23,000 , 22 క్యారెట్ రూ. 1,12,750 , 18 క్యారెట్ రూ. 92,250గా కొనసాగుతోంది.
  • ఢిల్లీలో 24 క్యారెట్ బంగారం రూ. 1,23,150 , 22 క్యారెట్ రూ. 1,12,900గా ఉండ ఉంది.
  • వడోదరా, అహ్మదాబాద్‌లలో స్వల్ప తేడాతో 24 క్యారెట్ గోల్డ్ రూ. 1,23,050 , 22 క్యారెట్ రూ. 1,12,800 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు కూడా నగరాన్నిబట్టి తేడా చూపిస్తున్నాయి. చెన్నై, హైదరాబాద్‌, విజయవాడ, కేరళ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ. 1.66 లక్షలు కాగా, ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా Kolkata, బెంగళూరు Banalore, పుణె, వడోదరా, అహ్మదాబాద్‌లలో రూ. 1.52 లక్షలుగా నమోదైంది.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలను ప్రభావితం చేసే అంశాలు ప్రస్తుతం మిశ్రమంగా ఉన్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం లేదని సంకేతాలు ఇవ్వడంతో డాలర్ బలపడింది. ఫలితంగా బంగారం మీద పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి.

మరోవైపు అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు కొంత మేరకు తగ్గడంతో ఇన్వెస్టర్లు సేఫ్ హేవెన్‌గా బంగారంపై ఆధారపడటాన్ని తగ్గించారు.