అక్షరటుడే, హైదరాబాద్: Today Gold Prices దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు Silver Prices గత కొన్ని వారాల నుంచి భారీ హెచ్చుతగ్గులతో వినియోగదారులను గుబులు పెట్టిస్తున్నాయి.
ఒక దశలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర లక్షా 30 వేల మార్క్‌ను దాటగా, తరువాత దాదాపు రూ.10,000 మేర తగ్గింది. అయితే ఈ తగ్గదల ఎక్కువ రోజులు లేదు.
ఇటీవల మళ్లీ ధరలు పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందారు. అయితే గత మూడు రోజులుగా బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది.
అంతర్జాతీయ మార్కెట్లలో ఏర్పడుతున్న పరిణామాలు, డాలర్ బలహీనత, క్రూడ్ ఆయిల్ మార్పులు, జియోపాలిటికల్ పరిస్థితుల ప్రభావంతో ధరలు మరికొంత తగ్గే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
Today Gold Prices | స్వల్ప తగ్గుదల..
సోమవారం (నవంబర్ 17, 2025) ఉదయం నమోదైన ప్రకారం బంగారం-వెండి ధరలు 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) – రూ.10 తగ్గి రూ.1,25,070గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) – రూ.10 తగ్గి రూ.1,14,640గా నమోదైంది. ఇక వెండి (1 కిలో) – రూ.100 తగ్గి రూ.1,68,900గా ఉంది.
తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రధాన నగరాల్లో తాజా ధరలు ఎలా ఉన్నాయనేది చూస్తే..
- హైదరాబాద్‌లో 24 క్యారెట్లు: ₹ 1,25,070 – 22 క్యారెట్లు: ₹1,14,640 – వెండి కిలో: ₹1,74,900గా ట్రేడ్ అయింది.
- విజయవాడ, విశాఖపట్నంలలో 24 క్యారెట్లు: ₹1,25,070 గా ట్రేడ్ కాగా – 22 క్యారెట్లు: ₹1,14,640గా – వెండి కిలో: ₹1,74,900గా నమోదైంది.
- ఢిల్లీలో Delhi 24 క్యారెట్లు: ₹1,25,220గా నమోదు కాగా – 22 క్యారెట్లు: ₹1,14,790గా – వెండి కిలో: ₹1,68,900గా ట్రేడ్ అయింది.
- ఇక ముంబయిలో 24 క్యారెట్లు: ₹1,25,070గా ట్రేడ్ కాగా – 22 క్యారెట్లు: ₹1,14,640గా – వెండి కిలో: ₹1,68,900గా నమోదైంది.
- ఇక చెన్నైలో Chennai 24 క్యారెట్లు: ₹1,25,990గా ట్రేడ్ కాగా – 22 క్యారెట్లు: ₹1,15,490 – వెండి కిలో: ₹1,74,900గా ట్రేడ్ అయింది.
- ఇక బెంగళూరులో 24 క్యారెట్లు: ₹1,25,070 – 22 క్యారెట్లు: ₹1,14,640 – వెండి కిలో: ₹1,68,900గా ట్రేడ్ అయింది.
పన్నులు, డిమాండ్ & సరఫరా, స్థానిక మార్కెట్ ట్రెండ్స్ లాంటి అంశాలపై ఆధారపడి బంగారం, వెండి ధరలు మారుతుంటాయి. అందుకే ప్రతి నగరంలో ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు కనిపిస్తాయి.
