అక్షరటుడే, హైదరాబాద్: Today Gold Prices | ఇటీవల బంగారం ధరలు Gold Prices భారీ ఎత్తున పెరిగి రికార్డు స్థాయిలో రూ. లక్షా 30 వేల మార్క్‌ను దాటిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత దాదాపు రూ.10,000 వరకు తగ్గిన ధరలు మళ్లీ పెరుగుతూ వణుకు పుట్టిస్తున్నాయి. అయితే గత రెండు రోజులుగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గడంతో కొంత ఉపశమనం కలిగింది.
శనివారం 10 గ్రాముల బంగారం పై రూ.2,000 వరకు తగ్గగా, వెండి కిలోపై రూ.4,000 తగ్గింది. సాధారణంగా బంగారం–వెండి ధరల్లో మార్పులు నిత్యం జరుగుతూనే ఉంటాయి.
ఒకరోజు పెరిగితే మరొకరోజు తగ్గడం సహజం. తాజాగా ఆదివారం (నవంబరు 16, 2025) ఉదయం వరకు ధరలు స్థిరంగా నమోదు అయ్యాయి.
Today Gold Prices | స్వల్ప తగ్గుదల..
భారతదేశంలో ఈ రోజు బంగారం–వెండి రేట్లు చూస్తే.. దేశీయ మార్కెట్లో నమోదైన ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల గోల్డ్ (10 గ్రాములు): రూ.1,25,080, 22 క్యారెట్ల గోల్డ్ (10 గ్రాములు): రూ.1,14,650, వెండి (1 కిలో): రూ.1,69,000గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
- హైదరాబాద్‌లో 24 క్యారెట్లు: రూ.1,25,080 కాగా, 22 క్యారెట్లు: రూ.1,14,650, వెండి కిలో: రూ.1,75,000గా ఉంది.
- విజయవాడ విశాఖపట్నంలో 24 క్యారెట్లు: రూ.1,25,080, 22 క్యారెట్లు: రూ.1,14,650, వెండి కిలో: రూ.1,75,000గా ఉంది.
ఇతర ప్రధాన నగరాలలో చూస్తే..
- ఢిల్లీలో Delhi 24 క్యారెట్లు: రూ.1,25,230 , 22 క్యారెట్లు: రూ.1,14,800 , వెండి కిలో: రూ.1,69,000గా ఉంది.
- ముంబయి Mumbai లో 24 క్యారెట్లు: రూ.1,25,080 , 22 క్యారెట్లు: రూ.1,14,650 , వెండి కిలో: రూ.1,69,000
- చెన్నైలో 24 క్యారెట్లు: రూ.1,26,000 , 22 క్యారెట్లు: రూ.1,15,500 , వెండి కిలో: రూ.1,75,000
- బెంగళూరులో 24 క్యారెట్లు: రూ.1,25,080 , 22 క్యారెట్లు: రూ.1,14,650 , వెండి కిలో: రూ.1,69,000గా ఉంది.
బంగారం–వెండి రేట్లు దేశవ్యాప్తంగా ఒకేలా ఉండవు. దీనికి కారణాలు స్థానిక డిమాండ్ సరఫరా, రాష్ట్ర ప్రభుత్వ పన్నులు, ట్రాన్స్పోర్ట్, మెయికింగ్ ఛార్జీలు, మార్కెట్ పరిస్థితులు.. ఇవన్నీ ధరల్లో స్వల్ప మార్పులకు కారణమవుతాయి.
