Homeతాజావార్తలుToday Gold Prices | హడలెత్తిస్తున్న గోల్డ్​ రేట్స్​.. ఈ రోజు పరిస్థితి ఏమిటంటే..!

Today Gold Prices | హడలెత్తిస్తున్న గోల్డ్​ రేట్స్​.. ఈ రోజు పరిస్థితి ఏమిటంటే..!

Today Gold Prices | బంగారం ధరలు అంచనాలను తిప్పికొడుతూ మళ్లీ ఎగబాకుతున్నాయి. గత వారం వరకు స్థిరంగా పడిపోతూ వచ్చిన పసిడి ధరలు ఇప్పుడు మ‌ళ్లీ ఎగసిప‌డుతున్నాయి.

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: Today Gold Prices | గత వారం రోజులుగా బంగారం ధరలు Gold Prices ఎగబాకుతున్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండటం, డాలర్‌తో పోలిస్తే రూపాయి క్షీణించడం వంటి అంశాలు బంగారంపై డిమాండ్‌ను పెంచుతున్నాయి.

ఈ ప్రభావంతో దేశీయ మార్కెట్లో ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. నవంబర్ 14న 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,28,660కు చేరుకోగా, 22 క్యారెట్ల ధర రూ. 1,17,910గా నమోదైంది.

Today Gold Prices | ధర‌లు పైపైకి..

ఢిల్లీలో Delhi 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,28,780 కాగా, 22 క్యారెట్ల ధర రూ. 1,18,060 గా ఉంది.

మరోవైపు వెండి ధరలు కూడా నిన్నటితో పోలిస్తే రూ. 100 మేర పెరిగాయి. దేశంలోని ముఖ్య నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి:

  • హైదరాబాద్, విజయవాడ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, కేరళ, పుణె నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,28,660, 22 క్యారెట్ల ధర రూ. 1,17,910గా ఉంది.
  • వడోదరలో 24 క్యారెట్ల ధర రూ. 1,28,680, 22 క్యారెట్ల ధర రూ. 1,17,960గా ఉంది.
  • వెండి ధరల Silver Prices విషయానికి వస్తే.. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, కేరళల్లో కేజీకి రూ. 1,83,100గా ఉంది.
  • ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరు, వడోదర, అహ్మదాబాద్‌లలో కేజీ వెండి ధర రూ. 1,73,100గా నమోదైంది.

బంగారం, వెండి ధరలు గ్లోబల్ మార్కెట్ పరిస్థితులు, కరెన్సీ మార్పిడి విలువలు, పెట్టుబడిదారుల ధోరణి ఆధారంగా మారుతుండడంతో రాబోయే రోజుల్లో కూడా పసిడి మార్కెట్ ఉత్కంఠంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Must Read
Related News