అక్షరటుడే, హైదరాబాద్: Today Gold Prices | బంగారం Gold కొనుగోలు చేయాలని అందరికీ ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో పసిడి ధరలు ఆకాశాన్ని తాకాయి.
బంగారం మాత్రమే కాదు, వెండి కూడా భారీగా పెరుగుతూ వస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలు, ఆధునిక పరికరాలలో వెండిని విస్తృతంగా ఉపయోగించడంతో దానికి డిమాండ్ పెరిగింది.
ఇటీవల బంగారం ధరలు భారీగా పెరిగిన తర్వాత కొంత మేరకు తగ్గాయి. గత రెండు రోజులుగా మళ్లీ పెరిగిన పసిడి రేటు, ఈరోజు మాత్రం కాస్త తగ్గడం వినియోగదారులకు ఊరట కలిగించే అంశం.
హైదరాబాద్‌లో బంగారం ధరలు (నవంబరు 13, 2025) ఎలా ఉన్నాయనేది చూస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,25,550గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,15,040గా నమోదైంది. ఇది నిన్నటి కంటే రూ. 330 మేర తగ్గింది.
Today Gold Prices | కాస్త తగ్గుదల..
ఇతర ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయనేది చూస్తే..
- ఢిల్లీ Delhi : 24 క్యారెట్ల బంగారం రూ.1,25,650 – 22 క్యారెట్ల రూ.1,15,190గా ట్రేడ్ అయింది.
- ముంబై: 24 క్యారెట్ల రూ.1,25,500 – 22 క్యారెట్ల రూ.1,15,040
- విజయవాడ: 24 క్యారెట్ల రూ.1,25,500 – 22 క్యారెట్ల రూ.1,15,040
- చెన్నై 24 క్యారెట్ల రూ.1,26,550 – 22 క్యారెట్ల రూ.1,15,990గా ట్రేడ్ అయింది.
- ఇక బెంగళూరు, కేరళ, కోల్‌కతా: 24 క్యారెట్ల రూ.1,26,500 – 22 క్యారెట్ల రూ.1,15,040గా ట్రేడ్ అయింది.
వెండి ధరలు ఎలా ఉన్నాయనేది చూస్తే.. వెండి ధరలు మాత్రం కాస్త పెరిగాయి. దేశవ్యాప్తంగా కిలో వెండి ధర సగటుగా రూ. 1,62,100 వద్ద ఉంది. కాగా హైదరాబాద్, చెన్నై, కేరళలలో కిలో వెండి ధర రూ. 1,73,100 వద్ద కొనసాగుతోంది.
పసిడి ధరలు తగ్గినప్పటికీ, వెండి ధరలు పెరుగుతున్న తీరు పెట్టుబడిదారుల్లో ఆసక్తి రేపుతోంది. నిపుణుల అంచనా ప్రకారం.. అంతర్జాతీయ మార్కెట్ మార్పులు, డాలర్ Dollar విలువ, వడ్డీ రేట్లు వంటి అంశాలపై ఆధారపడి రాబోయే రోజుల్లో బంగారం ధరల్లో మరింత మార్పు ఉండనుంది.
బంగారం ధరలు స్వల్పంగా తగ్గి వినియోగదారులకు ఊరట ఇచ్చినా.. వెండి మాత్రం పరుగులు పెడుతోంది. రానున్న రోజులలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
