Homeతాజావార్తలుToday Gold Prices | మళ్లీ ప‌రుగులు పెడుతున్న‌ బంగారం, వెండి ధరలు.. నేటి పరిస్థితి...

Today Gold Prices | మళ్లీ ప‌రుగులు పెడుతున్న‌ బంగారం, వెండి ధరలు.. నేటి పరిస్థితి ఏమిటంటే..!

Today Gold Prices | బంగారం, వెండి ధ‌ర‌లు మారుతూ వ‌స్తున్నాయి. ఒక రోజు త‌గ్గిన బంగారం ధ‌ర మ‌రో రోజు పెరుగుతూ పోతుంది. దీంతో సామాన్యులు బంగారం అంటే భ‌య‌ప‌డాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: Today Gold Prices | గత 10 రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి Silver ధరలకు శుక్రవారం కాస్త బ్రేకులు పడ్డాయి. ధరలు మళ్లీ పెరుగుతున్నాయి.

దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుదల దిశగా సాగుతున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,290 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,13,010 వద్ద కొనసాగుతోంది.

ఈ ధరలు మార్కెట్ పరిస్థితుల ఆధారంగా పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు పెరిగాయి.

శుక్రవారం ఉదయం 6:30 గంటలకు ఔన్స్ (సుమారు 28.34 గ్రాములు) బంగారం ధర $ 4030.80 (సుమారు రూ.3,57,575) గా నమోదైంది. ఇది $ 14.90 పెరిగినట్లుగా రికార్డు అయింది. అయితే వెండి ధరలో స్వల్ప తగ్గుదల నమోదైంది.

Today Gold Prices | మ‌ళ్లీ పైపైకి..

వెండి ఔన్స్‌కు $ 48.61 (సుమారు రూ.4,313) వద్ద ట్రేడవుతోంది. నవంబర్ 1, శనివారం కూడా బంగారం, వెండి ధరలు పెరుగుదల స్థాయిల్లోనే కొనసాగుతున్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో శనివారం ఉదయం బంగారం ధరలు Gold Prices ఇలా ఉన్నాయి.. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,23,440, 22 క్యారెట్ల ధర రూ.1,13,160గా న‌మోదైంది.

ముంబయి, బెంగళూరు, కోల్‌కతా, హైదరాబాద్‌, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,23,290గా ట్రేడ్ కాగా , 22 క్యారెట్ల ధర రూ.1,13,010గా నమోదయ్యాయి.

చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (24 carat gold) రూ.1,23,270, 22 క్యారెట్ల ధర (22 carat gold) రూ.1,12,990గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌, విజయవాడల్లో ధరలు సమానంగా కొనసాగుతున్నాయి. వెండి విషయానికొస్తే, కిలో వెండి Silver ధర రూ.1,50,900గా ఉంది.

బంగారం Gold కొనుగోలు చేసే ముందు దాని స్వచ్ఛతను తప్పనిసరిగా తనిఖీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణీకరణ సంస్థ (BIS) బంగారం స్వచ్ఛతను నిర్ధారించడానికి హాల్‌మార్క్‌ను ఉపయోగిస్తుంది. ఈ హాల్‌మార్క్ బంగారంలో ఉన్న క్యారెట్ల సంఖ్యను తెలియజేస్తుంది.

ఉదాహరణకు 24 క్యారెట్ బంగారం పై “999”, 23 క్యారెట్‌పై “958”, 22 క్యారెట్‌పై “916”, 21 క్యారెట్‌పై “875”, 18 క్యారెట్‌పై “750” అని ఉంటుంది. సాధారణంగా ఎక్కువగా 22 క్యారెట్ బంగారం ఆభరణాలే అమ్మకానికి ఉంటాయి. కొంతమంది 18 క్యారెట్ బంగారాన్ని కూడా ఉపయోగిస్తారు.

బంగారం, వెండి ధరల్లో ఈ పెరుగుదల కొనసాగుతుందా లేదా అనేది రాబోయే అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్‌లపై ఆధారపడి ఉంటుంది.

Must Read
Related News