Homeతాజావార్తలుToday Gold Prices | బంగారం కొనుగోలుదారులకు షాక్.. ఒక్కరోజులోనే భారీ పెరుగుదల!

Today Gold Prices | బంగారం కొనుగోలుదారులకు షాక్.. ఒక్కరోజులోనే భారీ పెరుగుదల!

Today Gold Prices | డాలర్ విలువ పెరుగుదల బంగారం మార్కెట్‌పై నేరుగా ప్రభావం చూపుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. డాలర్ బలపడినప్పుడు బంగారం ధరలు తగ్గే ధోరణి స్పష్టంగా కనిపిస్తుందని వారు విశ్లేషిస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: Today Gold Prices | బంగారం Gold Price కొనుగోలు చేయాలనుకున్న వారికి ఊహించని షాక్ తగిలింది. గత రెండు రోజులుగా వరుసగా తగ్గిన పసిడి ధరలు ఈరోజు భారీ ఎత్తున పెరిగాయి. దీంతో కొనుగోలు చేయాల‌ని అనుకున్న‌ వారు వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అమెరికా వాణిజ్య ఒప్పందాలు, చైనా china సుంకాల తగ్గింపు, ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల అంచనాలు, డాలర్‌ విలువ మార్పులు వంటి అంతర్జాతీయ అంశాలు బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపించాయి.

దీని ఫలితంగా ప్రపంచ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 17 డాలర్ల మేర పెరిగి 4000 డాలర్ల మార్క్‌ను దాటింది. సిల్వర్ ధర కూడా 0.31 శాతం పెరిగి ఔన్సుకు 48.36 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Today Gold Prices | ఎగ‌బాకిన ధ‌ర‌లు

రెండు రోజుల పాటు పడిపోయిన బంగారం ధరలకు ఇవాళ బ్రేక్ పడింది. హైదరాబాద్ Hyderabad బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పసిడి తులం రేటు రూ.1090 మేర పెరిగి రూ.1,22,570కి చేరుకుంది.

22 క్యారెట్ల బంగారం 22 carat gold తులం ధర రూ.1000 పెరిగి రూ.1,12,350కి ఎగబాకింది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి.

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2000 పెరిగి రూ.1,65,000కు చేరుకుంది. అయితే అహ్మదాబాద్, వడోదరా, ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, పుణె వంటి నగరాల్లో మాత్రం వెండి కిలో ధర రూ.1,52,500 వద్ద ఉంది. ఈ ధరలు నవంబరు 7వ తేదీ ఉదయం 7 గంటల సమయానికి న‌మోదు అయ్యాయి.

బులియన్ మార్కెట్‌లో రేట్లు రోజులోనే మారే అవకాశం ఉండటంతో, కొనుగోలు చేసే ముందు స్థానిక మార్కెట్‌లో తాజా ధరలు తెలుసుకోవడం మంచిది.

మొత్తం మీద, బంగారం ధరలు తిరిగి రికార్డ్ Record స్థాయికి చేరుతుండటంతో పసిడి ప్రియులు తాత్కాలికంగా కొనుగోలును వాయిదా వేస్తున్న పరిస్థితి నెలకొంది.

బంగారం ధరలు అనేక అంశాల ప్రభావంతో మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లలో పసిడి రేట్లు, యూఎస్ డాలర్ మారకం విలువ, వివాహాలు, పండుగ సీజన్‌లలో పెరిగే డిమాండ్‌ వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి.

ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలు పెరిగితే, దాని ప్రభావం భారత మార్కెట్‌పైనా వెంటనే కనిపిస్తుంది. అలాగే, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు లేదా ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పుడు, బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా పరిగణించి ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.

Must Read
Related News