అక్షరటుడే, హైదరాబాద్: Today Gold Prices | ఇటీవలి కాలంలో వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు సామాన్యులకు భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు పెరుగుతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడి అవకాశాలపై దృష్టి సారించడంతో బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది.
దేశీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు Silver Prices వరుసగా పెరుగుతూ వినియోగదారుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఈ ధరలు సాధారణ కుటుంబాలపై భారం పెంచుతున్నాయి.
Today Gold Prices | తగ్గేదేలే..
డిసెంబర్ 9న ఉదయం నమోదైన ధరలు చూస్తే.. దేశీయంగా తులం (10 గ్రాములు) బంగారం ధర రూ.1,30,430 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,30,430గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ.1,19,560కి చేరింది. ఇక ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (డిసెంబర్ 9) చూస్తే..
- చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాములు: రూ.1,31,340 , 22 క్యారెట్ల 10 గ్రాములు: రూ.1,20,390గా ట్రేడ్ అయింది.
- ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాములు: రూ.1,30,580గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల 10 గ్రాములు: రూ.1,19,710గా నమోదైంది.
- ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాములు: రూ.1,30,430 , 22 క్యారెట్ల 10 గ్రాములు: రూ.1,19,560గా ట్రేడ్ అయింది.
- హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాములు: రూ.1,30,430గా నమోదు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాములు: రూ.1,19,560గా ట్రేడ్ అయింది.
- ఇక విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాములు: రూ.1,30,430గా నమోదు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాములు: రూ.1,19,560గా ట్రేడ్ అయింది.
- బెంగళూరులో Bangalore 24 క్యారెట్ల 10 గ్రాములు:1,30,430గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల 10 గ్రాములు: రూ.1,19,560గా నమోదైంది.
బంగారంతో పాటు వెండి ధర కూడా పెరుగుతూ పోతుంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో వెండి కిలో ధర రూ.1,88,900 వద్ద ఉంది. వెండి కూడా అంతర్జాతీయ మార్కెట్ ఒడుదుడుకుల ప్రభావంతో గత కొన్ని రోజులుగా పైపైకి కదులుతోంది.
నిపుణుల విశ్లేషణ ప్రకారం ధరల పెరుగుదలకి కారణం అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ Dollar బలహీనత, బంగారం, వెండిపై పెట్టుబడులు పెరగడం, జియోపాలిటికల్ టెన్షన్స్, పెళ్లి సీజన్ డిమాండ్ వంటివి ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా చెప్పబడుతున్నాయి.