అక్షరటుడే, హైదరాబాద్: Today Gold Prices | ఈ మధ్య కాలంలో బంగారం ధరలు Gold Prices ఒక్కసారిగా పెరగడం, కొద్ది రోజులకి కాస్త తగ్గడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే గత రెండు రోజులుగా కాస్త తగ్గినట్టు కనిపించిన గోల్డ్ రేట్స్ మళ్లీ పెరిగాయి.
ఇటీవలి కాలంలో రూ. లక్షా 30 వేల మార్క్‌ను దాటి వణుకు పుట్టించాయి. మధ్యలో బంగారం ధరలు కొంతకాలం తగ్గినప్పటికీ, మళ్లీ ఇప్పుడు భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు ఎగబాకుతున్న నేపథ్యంలో దేశీయంగా కూడా ధరలు పెరుగుతున్నాయని బులియన్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆర్థిక, రాజకీయ పరిణామాలు బంగారం–వెండి రేట్లపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. అందువల్ల కొన్ని రోజులు పెరిగితే, మరికొన్ని రోజులు తగ్గడం సహజమైపోయింది.
Today Gold Prices | నగరాల వారీగా ఎందుకు వ్యత్యాసాలు?
శనివారం (డిసెంబర్ 6, 2025) ఉదయం వరకు స్వల్ప మార్పులు నమోదయ్యాయి. దేశీయ బంగారం–వెండి రేట్లు ఇలా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.10 పెరిగి రూ.1,29,940కు చేరింది. 22 క్యారెట్ల పసిడి కూడా రూ.10 మేర పెరిగి రూ.1,19,110 గా ఉంది.
వెండి ధర Silver Price మాత్రం రూ.100 తగ్గి కిలో రూ.1,86,900గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయనేది చూస్తే.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,29,940 కాగా, 22 క్యారెట్లు రూ.1,19,110 వద్ద ఉంది. వెండి కిలో రూ.1,95,900గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా ఇదే ధరలు నమోదయ్యాయి.
దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో ధరలు చూస్తే ..
- ఢిల్లీలో Delhi 24 క్యారెట్లు రూ.1,30,090గా ట్రేడ్ కాగా; 22 క్యారెట్లు – రూ.1,19,260గా నమోదైంది; వెండి కిలో – రూ.1,86,900గా ఉంది.
- ముంబై: 24 క్యారెట్లు – రూ.1,29,940; 22 క్యారెట్లు – రూ.1,19,110; వెండి – రూ.1,86,900
- చెన్నై: 24 క్యారెట్లు – రూ.1,30,090; 22 క్యారెట్లు – రూ.1,19,990; వెండి – రూ.1,95,900
- బెంగళూరు: 24 క్యారెట్లు – రూ.1,29,940; 22 క్యారెట్లు – రూ.1,19,110; వెండి – రూ.1,86,900గా ట్రేడ్ అయింది.
స్థానిక డిమాండ్–సరఫరా, రాష్ట్ర పన్నులు, మార్కెట్ పరిస్థితులు బంగారం–వెండి ధరలను ప్రభావితం చేస్తాయి. అందువల్ల ప్రతి నగరంలో రేట్లు కొంత తేడాతో కనిపిస్తాయి.
