అక్షరటుడే, హైదరాబాద్: Today Gold Prices | బంగారం Gold కొనుగోలు చేయాలనుకునే వారికి సోమవారం ఊరటనిచ్చే వార్త అందింది. గత కొద్దిరోజులుగా అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో పాటు డిమాండ్ పెరగడంతో భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈ వారం తొలి రోజే స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత వారం మొత్తం గోల్డ్ రేట్లు రోజురోజుకూ పెరుగుతుండటంతో ఇదే ట్రెండ్ కొనసాగుతుందని చాలామంది భావించినా, సోమవారం మాత్రం బంగారం ధరలు కొద్దిగా తగ్గడం కొనుగోలుదారులకు ఉపశమనం కలిగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సోమవారం గోల్డ్ రేట్లను పరిశీలిస్తే హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,34,170గా నమోదైంది, ఇది నిన్నటి ధరతో పోలిస్తే రూ.10 తగ్గింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,22,990గా ఉంది, నిన్నటి ధర రూ.1,23,000తో పోలిస్తే స్వల్ప తగ్గుదల కనిపించింది.
Today Gold Prices | తగ్గిన ధరలు..
విజయవాడలో Vijaywada కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి, అక్కడ 24 క్యారెట్ల బంగారం రూ.1,34,170గా ఉండగా, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,22,990గా ఉంది. విశాఖపట్నంలోనూ ఇదే రేట్లు కొనసాగుతున్నాయి. ఇక చెన్నై మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,35,270గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,23,990గా కొనసాగుతోంది. బెంగళూరులో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ.1,34,170గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,22,990 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి.
ఇక హైదరాబాద్లో Hyderabad కిలో వెండి ధర రూ.2,25,900గా ఉండగా, నిన్నటి ధర రూ.2,26,000తో పోలిస్తే రూ.100 తగ్గింది. విజయవాడలో కేజీ వెండి ధర రూ.2,25,900గా కొనసాగుతుండగా, విశాఖపట్నంలో కూడా ఇదే ధరలు ఉన్నాయి. మొత్తం మీద బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల రావడంతో పెట్టుబడిదారులు, వివాహాల కోసం కొనుగోలు చేయాలనుకునేవారు కొంత ఊరట పొందుతున్నారు. కొత్త సంవత్సరం సమీపిస్తున్న నేపథ్యంలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే అత్యవసరం అనిపిస్తే కాస్త తగ్గినప్పుడే బంగారం కొనుగోలు చేయడం మంచిది.