అక్షరటుడే, హైదరాబాద్: Today Gold Prices | గత కొద్దిరోజులుగా బంగారం ధరల్లో Gold Rates భారీ హెచ్చుతగ్గులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఒకరోజు ఒక్కసారిగా తగ్గితే, మరుసటి రోజు మళ్లీ పెరుగుతూ సామాన్య వినియోగదారులను గందరగోళానికి గురిచేస్తున్నాయి.
ఈ ఊహించని మార్పుల కారణంగా బంగారం ఎప్పుడు కొనాలి అన్నది అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. అయితే గత వారం రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు ఇప్పుడు కాస్త బ్రేక్ పడింది. ఆదివారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు.
ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ మొదలవడంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. ఇలాంటి సమయంలో ధరలు స్థిరంగా ఉండటం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్‌గానే చెప్పొచ్చు . జువెలరీ షాపుల్లో కూడా కస్టమర్ల సందడి పెరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.
Today Gold Prices | అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితి
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 7.95 డాలర్లు పెరిగింది. దీంతో ఒక్క ఔన్స్ బంగారం ధర 4340 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో స్పాట్ సిల్వర్ ధర కూడా ఔన్సుకు 1.85 డాలర్లు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న ఈ కదలికలు దేశీయ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో Telugu States ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి.
- హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,34,180 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,23,000గా ఉంది.
- విజయవాడలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.1,34,180 కాగా, 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,23,000గా ట్రేడ్ అవుతుంది.
- విశాఖపట్నం, విజయవాడలలో హైదరాబాద్‌తో Hyderabad సమానంగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,34,180గా ట్రేడ్ అవుతుండగా, 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,23,000గా కొనసాగుతోంది.
ఇతర ప్రధాన నగరాల్లో రేట్లు చూస్తే..
- చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,35,280గా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,24,000గా ట్రేడ్ అయింది.
- బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,34,180గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,23,000గా కొనసాగుతోంది.
ఇక వెండి ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయి.హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2,26,000 కాగా, విజయవాడలో కేజీ వెండి ధర రూ.2,26,000గా ఉంది. విశాఖపట్నంలో కేజీ వెండి ధర రూ.2,26,000గా ట్రేడ్ అయింది. చెన్నై, బెంగళూరులో కూడా ఇదే ధర కొనసాగుతోంది. అయితే అంతర్జాతీయ పరిస్థితులు, డాలర్ మారకం విలువ ఆధారంగా రాబోయే రోజుల్లో ధరల్లో మళ్లీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.