అక్షరటుడే, హైదరాబాద్: Today Gold Prices | గత రెండు రోజులుగా తగ్గినట్లే కనిపించిన బంగారం ధరలు Gold Rates ఒక్కసారిగా పుంజుకుని మళ్లీ ఆల్‌టైం రికార్డ్ స్థాయిలో కొనసాగుతున్నాయి. నిన్న ఒక్కరోజే తులం బంగారంపై రూ.650 పెరిగిన విషయం తెలిసిందే. ఇదే ట్రెండ్ ఇవాళ కూడా కొనసాగుతూ, డిసెంబర్ 18 గురువారం ఉదయం ఆరు గంటలకు మార్కెట్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,34,520 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం రూ.650 పెరిగి రూ.1,34,510గా ఉన్న తులం బంగారం ధర ఇవాళ ఉదయానికి మరో రూ.10 పెరిగి ఈ స్థాయికి చేరుకుంది. ఇక 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,23,310గా కొనసాగుతోంది. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా పరుగులు పెడుతున్నాయి.
Today Gold Prices | వణికిస్తున్న బంగారం..
నిన్న ఒక్కరోజే కేజీ వెండిపై Silver ఏకంగా రూ.11 వేల వరకు పెరగ్గా, బుధవారం నుంచి గురువారం మధ్యలో స్వల్పంగా పెరిగి వెండి ధరలు కూడా హాల్‌టైం హైకి చేరుకున్నాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో కేజీ వెండి ధర రూ.2,08,100గా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో చూస్తే..
- ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,670గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,23,460గా ఉంది.
- ముంబై, హైదరాబాద్, విజయవాడ, బెంగళూరుల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,520గా, 22 క్యారెట్ల ధర రూ.1,23,310గా కొనసాగుతోంది.
- చెన్నైలో మాత్రం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,290గా, 22 క్యారెట్ల ధర రూ.1,24,010గా నమోదైంది.
బంగారం, వెండి ధరలు ఈ స్థాయిలో పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ Dollar విలువ తగ్గడమేనని నిపుణులు చెబుతున్నారు. డాలర్ బలహీనపడితే బంగారం, వెండి వంటి విలువైన లోహాలపై పెట్టుబడులు పెరుగుతాయని, దాంతో ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తాయని వారు వివరిస్తున్నారు. అందుకే బంగారం లేదా వెండి కొనుగోలు చేసే ముందు రోజువారీ ధరలను తప్పకుండా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.