అక్షరటుడే, హైదరాబాద్: Today Gold Prices | దేశంలో బంగారానికి Gold ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మహిళలు బంగారాన్ని సంపదగా మాత్రమే కాకుండా సంప్రదాయానికి ప్రతీకగా భావిస్తుంటారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు వచ్చాయంటే ముందుగా గుర్తుకు వచ్చేది బంగారం కొనుగోలు. అయితే ఇటీవల కాలంలో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో సామాన్యులు గ్రాము బంగారం కొనాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. గడిచిన వారం రోజులుగా బంగారం ధరల్లో భారీ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, డాలర్ మారకం విలువ, క్రూడ్ ఆయిల్ ధరలు, కేంద్ర బ్యాంకుల విధానాలు వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా దేశీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ప్రస్తుతం తులం (10 గ్రాములు) బంగారం కొనాలంటే దాదాపు లక్షా 35 వేల రూపాయల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Today Gold Prices | క్రమంగా పెరుగుతున్న ధరలు…
ప్రస్తుతం దేశీయంగా 24 క్యారెట్ల తులం బంగారం ధర Gold Price రూ.1,33,900 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. లక్షా 22 వేల రూపాయల స్థాయిలో ఉండటంతో సాధారణ ప్రజలు బంగారం కొనుగోలు విషయంలో వెనుకడుగు వేస్తున్నారు.
ముఖ్యంగా రాబోయే వివాహ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని బంగారం కొనాలనుకున్న మధ్యతరగతి కుటుంబాలకు ఇది పెద్ద భారంగా మారింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయనేది చూస్తే..
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,900గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,22,740గా నమోదైంది.
- విజయవాడలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల బంగారం రూ.1,33,900గా, 22 క్యారెట్ల బంగారం రూ.1,22,740గా ఉంది.
- దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,060గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,22,890గా ఉంది.
- ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,33,900గా, 22 క్యారెట్ల ధర రూ.1,22,740గా కొనసాగుతోంది. బెంగళూరులోనూ ఇదే స్థాయి ధరలు నమోదయ్యాయి.
- చెన్నైలో Chennai మాత్రం ఇతర నగరాలతో పోలిస్తే కొద్దిగా ఎక్కువగా ఉండి, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,940గా, 22 క్యారెట్ల ధర రూ.1,23,690గా ఉంది.
ఇక వెండి ధరలు కూడా బంగారానికి తగ్గట్టుగానే పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ.1,97,900 వద్ద కొనసాగుతోంది. గతంతో పోలిస్తే వెండి ధరలు కూడా గణనీయంగా పెరగడంతో చిన్న పెట్టుబడిదారులు సైతం ఆలోచనలో పడుతున్నారు.