అక్షరటుడే, హైదరాబాద్: Today Gold Prices | బంగారం, వెండి ధరలకు Silver Prices రోజురోజుకు రెక్కలొస్తున్నాయి. ధరలను గమనిస్తే సమీప భవిష్యత్తులో తగ్గే సూచనలు కనిపించడం లేదని, రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. నిన్న ఒక్కరోజే బంగారం ధర రూ.800కుపైగా పెరగగా, గత రెండు మూడు రోజుల వ్యవధిలో దాదాపు రూ.3వేలకుపైగా పెరిగింది. వెండి కూడా అదే స్థాయిలో పరుగులు పెడుతోంది. గత ఆదివారం డిసెంబర్ 7న కిలో వెండి ధర రూ.1,90,000గా ఉండగా, ప్రస్తుతం రూ.2,15,100 వద్ద కొనసాగుతోంది, అంటే వారం రోజుల్లోనే దాదాపు రూ.15వేలకుపైగా పెరిగింది.
Today Gold Prices | భగ్గుమంటున్న ధరలు..
డిసెంబర్ 13 ఉదయం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర Gold Price రూ.1,33,210గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,110గా నమోదైంది. ప్రధాన నగరాల్లోనూ ఇదే స్థాయిలో ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,210గా, 22 క్యారెట్ల ధర రూ.1,22,260గా ఉండగా, ముంబై, హైదరాబాద్, విజయవాడ, బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,33,210గా, 22 క్యారెట్ల ధర రూ.1,22,110గా కొనసాగుతోంది. చెన్నైలో మాత్రం స్వల్పంగా అధికంగా ఉండి, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,960గా ఉంది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,23,710గా నమోదైంది. ఈ ధరలు ఎప్పుడైనా పెరగవచ్చని, తగ్గవచ్చని లేదా స్థిరంగా కొనసాగవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
బంగారం ధరలను మించి వెండి ధరలు వేగంగా దూసుకుపోతుండడం కలవరపరుస్తుంది. పెట్టుబడులు పెట్టే వారికి వెండి ప్రస్తుతం ఉత్తమ ఆప్షన్‌గా మారిందని స్టాక్ మార్కెట్ Stock Market నిపుణులు సూచిస్తున్నారు. రోజురోజుకు వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. నిన్న కిలో వెండి ధర రూ.2,15,000 వద్ద ట్రేడింగ్ జరగగా, 100 గ్రాముల వెండి ధర రూ.21,500 దగ్గర నిలిచింది. ఈ రోజు శనివారం కిలోపై రూ.100, 100 గ్రాములపై రూ.10 పెరిగింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,15,100గా, 100 గ్రాముల వెండి ధర రూ.21,510 వద్ద ట్రేడ్ అవుతోంది.