అక్షరటుడే, హైదరాబాద్: Today Gold Prices | ఇటీవల రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం ధరలు Gold Rates స్వల్పంగా దిగొచ్చాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ధరల్లో కోత పడింది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం బుధవారం ఉదయం 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,850గా నమోదైంది. నిన్న ఇదే సమయంతో పోలిస్తే సుమారు రూ.1,500 మేర తగ్గింది.
ఆర్నమెంటల్ గోల్డ్ అయిన 22 క్యారెట్ బంగారం ధర కూడా భారీగా తగ్గి రూ.1,22,690కు చేరుకుంది. వెండి ధరలు కూడా కొంత నెమ్మదించగా ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,99,000గా ఉంది. ఉక్రెయిన్–రష్యా మధ్య శాంతి ఒప్పందంపై చర్చలు సానుకూలంగా సాగుతున్నాయన్న సంకేతాలు గోల్డ్‌పై డిమాండ్ తగ్గడానికి కారణమయ్యాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
Today Gold Prices | స్మాల్ బ్రేక్..
అదే సమయంలో ప్రాఫిట్ బుకింగ్ కూడా ధరలపై ప్రభావం చూపింది. అయితే ఈ తగ్గుదల స్వల్పకాలిక దిద్దుబాటు మాత్రమేనని, డాలర్ బలహీనత కొనసాగుతున్న నేపథ్యంలో బంగారం ధరలు మళ్లీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నగరాల వారీగా చూస్తే చెన్నైలో 24 క్యారెట్ బంగారం ధర రూ.1,34,720గా ఉండగా, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, కేరళ, పుణెలో రూ.1,33,850గా నమోదైంది. న్యూఢిల్లీలో రూ.1,34,000గా ఉండగా, వడోదరా, అహ్మదాబాద్‌లో రూ.1,33,900గా ఉంది. వెండి ధరలు చెన్నై, హైదరాబాద్, విజయవాడ, కేరళలో Kerala కిలోకు రూ.2,10,900గా ఉండగా, మిగతా ప్రధాన నగరాల్లో రూ.1,99,000గా కొనసాగుతున్నాయి.
అయితే పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్ల ధరలు మార్కెట్లలో ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కాబట్టి కొనుగోలుదారులు కొనుగోలు చేసే సమయంలో ధరలు పరిశీలించాల్సిందిగా విశ్లేషకులు సూచనలు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా పెరుగుతూ పోయిన బంగారం ధరలకి Gold Prices ఈ రోజు కాస్త చెక్ పడడం ఉపశమనం కలిగిస్తుంది.