అక్షరటుడే, హైదరాబాద్: Today Gold Prices | దేశంలో బంగారం, వెండి ధరలు Silver Prices మళ్లీ పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా లాభాల స్వీకరణ కారణంగా స్వల్పంగా తగ్గిన ఈ విలువైన లోహాలు మళ్లీ ఎగబాకుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ బలహీనపడటం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోత ఊహాగానాలు రాకపోవడంతో ఇన్వెస్టర్లు సేఫ్ హావెన్‌గా బంగారంపై మళ్లీ దృష్టి సారిస్తున్నారు.
ఫలితంగా దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలలో పెరుగుదల కనిపిస్తుంది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నవంబరు 4న దేశంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,180కి చేరింది.
ఇది నిన్నటితో పోలిస్తే స్వల్పంగా పెరుగుదల. 22 క్యారెట్ బంగారం ధర రూ.1,12,910గా నమోదైంది. మరోవైపు వెండి ధర కిలోకు రూ.100 మేర పెరిగి రూ.1,54,100కు చేరింది.
Today Gold Prices | క్రమంగా పెరుగుతున్న ధరలు..
అంతర్జాతీయ మార్కెట్ international market లో ఔన్స్ 24 క్యారెట్ బంగారం ధర 3,996 అమెరికా డాలర్ల వద్ద ఉండగా, ఔన్స్ వెండి ధర 48 డాలర్ల dollars వద్ద తచ్చాడుతోంది.
దేశీయ ఎమ్‌సీఎక్స్ మార్కెట్‌లో కూడా స్వల్ప లాభాలు నమోదయ్యాయి. డిసెంబరు గోల్డ్ ఫ్యూచర్స్ (10 గ్రాములు) ధర రూ.1,21,987 వద్ద ట్రేడవుతున్నాయి.
వెండి ఫ్యూచర్స్ రూ.1.48 లక్షల వద్ద కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు Gold Prices కూడా ఒకే రేంజ్‌లో ఉన్నాయి.
- చెన్నైలో 24 క్యారెట్ బంగారం ధర రూ.1,23,830 , 22 క్యారెట్ రూ.1,13,510 గా ఉంది.
 - ముంబయి, హైదరాబాద్, కోల్‌కతా, బెంగళూరు, విజయవాడ, కేరళలో 24 క్యారెట్ ధర రూ.1,23,180 , 22 క్యారెట్ రూ.1,12,910గా ఉంది.
 - ఢిల్లీలో 24 క్యారెట్ బంగారం 24 carat gold రూ.1,23,330 , 22 క్యారెట్ 22 carat gold రూ.1,13,040గా నమోదైంది.
 - వడోదరా, అహ్మదాబాద్‌లలో 24 క్యారెట్ బంగారం రూ.1,23,230 , 22 క్యారెట్ రూ.1,12,940గా ఉంది.
 
వెండి ధరలు కూడా నగరాల వారీగా స్వల్ప వ్యత్యాసంతో కొనసాగుతున్నాయి. చెన్నై, హైదరాబాద్, విజయవాడ, కేరళలో కిలో వెండి ధర రూ.1,68,100గా ఉంది.
ముంబయి Mumbai, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, పుణె, వడోదరా, అహ్మదాబాద్‌లలో రూ.1,54,100గా ఉంది. మొత్తంగా చూస్తే, బంగారం, వెండి ధరలు ప్రస్తుతం స్థిరమైన పెరుగుదల దిశలో సాగుతున్నాయి.
ఆర్థిక నిపుణులు దీపావళి సీజన్, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు, డాలర్ బలహీనత వంటి అంశాల ప్రభావంతో వచ్చే రోజుల్లో కూడా బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
