అక్షరటుడే, హైదరాబాద్: Today Gold Prices | గత కొంతకాలంగా పరుగులు పెట్టిన బంగారం ధరలు Gold Price ఇప్పుడు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.
ఒకప్పుడు లక్షా 30 వేల రూపాయలు దాటిన పసిడి ధర, ప్రస్తుతం లక్షా 20 వేల పరిధిలోకి దిగొచ్చింది. అయినా కూడా సామాన్య ప్రజలకు బంగారం అందని ద్రాక్ష మాదిరిగానే మారింది.
అక్టోబర్ 31 నాటికి దేశీయ ధరలు ఎలా ఉన్నాయనేది చూస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,21,470గా నమోదు కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,11,340గా నమోదైంది. ఇక కిలో వెండి ధర రూ. 1,50,900గా నమోదు కాగా, కొన్ని వారాల క్రితం ఇది రూ. 2 లక్షల దాకా వెళ్లింది.
Today Gold Prices | కాస్త ఉపశమనం
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయనేది చూస్తే.. ఢిల్లీలో 24 క్యారెట్లు – ₹1,21,620, 22 క్యారెట్లు – ₹1,11,490గా ట్రేడ్ అయ్యాయి.
ఇక ముంబైలో Mumbai 24 క్యారెట్లు – ₹1,21,470, 22 క్యారెట్లు – ₹1,11,340గా నమోదుయ్యాయి. అలానే చెన్నైలో 24 క్యారెట్లు – ₹1,23,270గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్లు – ₹1,12,990గా ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్లు – ₹1,21,470గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్లు – ₹1,11,340గా నమోదైంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చూస్తే.. హైదరాబాద్: 24 క్యారెట్లు – ₹1,21,470గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్లు – ₹1,11,340గా ఉంది. ఇక విజయవాడలో 24 క్యారెట్లు – ₹1,21,470,22 క్యారెట్లు – ₹1,11,340గా ఉంది.
బంగారం ధరలు కొంతమేర తగ్గినా, కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు అది పెద్దగా ఉపశమనం ఇవ్వడం లేదు. ఒకప్పుడు లక్షలోపు దొరికే తులం బంగారం ఇప్పుడు లక్షా 20 వేల వరకు చేరడంతో మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేయడంలో వెనుకడుగు వేస్తున్నారు.
ఇక నిపుణుల అంచనా ప్రకారం, గ్లోబల్ మార్కెట్‌లో డాలర్ Dollar బలపడటం, వడ్డీ రేట్లు స్థిరంగా ఉండటం వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి.
కానీ పండుగ సీజన్ నేపథ్యంలో తిరిగి ధరలు పెరిగే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. మొత్తం మీద పసిడి విలువ తగ్గినా, కొనుగోలు చేయడానికి మాత్రం ఇంకా ధైర్యం కావాలనే పరిస్థితి కొనసాగుతోంది!
1 comment
[…] నగరాల్లో శనివారం ఉదయం బంగారం ధరలు Gold Prices ఇలా ఉన్నాయి.. ఢిల్లీలో 24 క్యారెట్ల […]
Comments are closed.