Homeతాజావార్తలుToday Gold prices | తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు.. కొనుగోలుదారులకు కాస్త ఊరట

Today Gold prices | తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు.. కొనుగోలుదారులకు కాస్త ఊరట

Today Gold prices | మొన్న‌టి వ‌ర‌కు ఆకాశాన్నంటిన బంగారం ధరలు స్వల్పంగా తగ్గడం సాధారణ కొనుగోలుదారులకు కొంత ఊరట కలిగించినా, మార్కెట్ అనిశ్చితి కారణంగా ధరలు మళ్లీ ఎప్పుడు పెరిగిపోతాయో చెప్పలేమన్నది నిపుణుల అభిప్రాయం.

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: Today Gold prices | గత కొద్దిరోజులుగా పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలు Silver Prices ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి.

ఒక దశలో రూ.లక్షా 33 వేల వరకు దూసుకెళ్లిన బంగారం ధరలు ఇప్పుడు రూ. లక్షా 20 వేల దిగువకు చేరుకుంటూ కొనుగోలుదారులకు కొంత ఉపశమనం కలిగిస్తున్నాయి. అయినప్పటికీ ధరలు ఇప్పటికీ సామాన్యుడికి భారమైనవే.

నిన్న తులం బంగారం ధర రూ.1,22,000 పైగా ఉండగా, అక్టోబరు 29 నాటికి దాదాపు రూ.1,500 వరకు తగ్గింది. ప్రస్తుతం దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,20,810 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,10,740గా నమోదైంది.

ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవిగా గమనించాలి, రోజు మొత్తంలో మార్కెట్ పరిస్థితుల ఆధారంగా పెరుగుదల లేదా మరింత తగ్గుదల సంభవించే అవకాశం ఉంది.

Today Gold prices | త‌గ్గుతున్న ధ‌ర‌లు..

ప్రధాన నగరాల వారీగా చూస్తే ఢిల్లీలో Delhi 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,20,960గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,10,890గా ఉంది.

హైదరాబాద్‌, విజయవాడ, ముంబై, చెన్నై, బెంగళూరు నగరాల్లో 24 క్యారెట్ల బంగారం (24 carat gold) ధర రూ.1,20,810గా, 22 క్యారెట్ల (22 carat glod) ధర రూ.1,10,740గా కొనసాగుతోంది.

ఇక వెండి విషయానికి వస్తే, ఈ లోహం కూడా తగ్గుముఖం పట్టింది. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.1,50,900 వద్ద ఉంది. అయితే హైదరాబాద్‌, కేరళ, చెన్నై ప్రాంతాల్లోధరలు ఎక్కువగానే ఉన్నాయి. కిలో వెండి ధర రూ.1,64,900గా కొనసాగుతోంది.

మార్కెట్ విశ్లేషకుల ప్రకారం, బంగారం Gold, వెండి ధరల్లో వచ్చే మార్పులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్, సరఫరా, మరియు డాలర్ బలహీనత వంటి అంశాలు కారణమవుతున్నాయి.

అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక అనిశ్చితి, జియోపాలిటికల్ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు తమ ఆస్తులను సురక్షితంగా ఉంచుకోవడానికి బంగారం, వెండి వంటి విలువైన లోహాల వైపు మొగ్గు చూపుతున్నారు.

నిపుణుల అంచనా ప్రకారం, ప్రస్తుత తగ్గుదల తాత్కాలికం మాత్రమే కావచ్చు. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మళ్లీ పెరుగుదల దిశగా సాగే అవకాశాలు ఉన్నాయని వారు చెబుతున్నారు.