Homeతాజావార్తలుToday Gold Prices | క్ర‌మంగా తగ్గుముఖం పడుతున్న బంగారం ధ‌ర‌.. నేడు తులం ఎంతంటే..!

Today Gold Prices | క్ర‌మంగా తగ్గుముఖం పడుతున్న బంగారం ధ‌ర‌.. నేడు తులం ఎంతంటే..!

Today Gold Prices అంతర్జాతీయ వాణిజ్యంలో కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా బంగారానికి డిమాండ్ తగ్గుతోంది. దీంతో పసిడి ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: Today Gold Prices | దేశీయ మార్కెట్లో బంగారం ధరలు Gold Pricesతగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న పతనం ఈ వారం మరింత స్పష్టంగా కనిపిస్తోంది.

బంగారానికి డిమాండ్ తగ్గిపోవడం, అంతర్జాతీయ మార్కెట్లో ద్రవ్యోల్బణం తగ్గుదల, అమెరికా-చైనా వాణిజ్య చర్చల్లో పురోగతి, డాలర్ బలపడటం వంటి అంశాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయి.

గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, మంగళవారం (అక్టోబర్ 28) దేశంలో బంగారం ధరలు రూ.1.25 లక్షల మార్క్ కంటే దిగువకు చేరుకున్నాయి.

24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,270గా ఉండగా, 22 క్యారెట్ బంగారం రూ.1,12,990కు చేరింది. 18 క్యారెట్ బంగారం ధర రూ.92,450గా నమోదైంది. వెండి ధరల్లో కూడా స్వల్ప తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,54,900గా ఉంది.

Today Gold Prices | క్ర‌మేపి త‌గ్గుద‌ల‌..

అంతర్జాతీయంగా కూడా పసిడి ధరలు పడిపోతున్నాయి. ప్రపంచ మార్కెట్లో ఔన్స్ మేలిమి బంగారం ధర ప్రస్తుతం 4,010 అమెరికా డాలర్లుగా ఉంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్న నేపథ్యంలో బంగారం ధరలు ఇంకా కాస్త తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) 24 క్యారెట్,22 క్యారెట్, 18 క్యారెట్‌ల ప‌రంగా చూస్తే..చెన్నై Chennai ₹1,24,900,₹1,14,490, ₹95,740, ముంబై ₹1,23,270, ₹1,12,990, 92,450, దిల్లీ ₹1,23,420,₹1,13,140, ₹92,600, కోల్‌కతా ₹1,23,270,₹1,12,990,₹92,450, బెంగళూరు ₹1,23,270,₹1,12,990, ₹92,450, హైదరాబాద్ ₹1,23,270, ₹1,12,990, ₹92,450, కేరళ ₹1,23,270, ₹1,12,990, ₹92,450, పూణె ₹1,23,270, ₹1,12,990, ₹92,450, వడోదరా ₹1,23,320, ₹1,13,040, ₹92,500, అహ్మదాబాద్ ₹1,23,320, ₹1,13,040, ₹92,500గా న‌మోద‌య్యాయి.

ఇక వెండి ధరలు Silver Prices (కిలోకు) చూస్తే.. చెన్నైలో ₹1,69,900, ముంబై ₹1,54,900, దిల్లీలో ₹1,54,900, కోల్‌కతాలో ₹1,54,900, బెంగళూరులో ₹1,56,900, హైదరాబాద్‌లో ₹1,69,900, కేరళలో ₹1,69,900, పూణెలో ₹1,54,900, వడోదరాలో ₹1,54,900, అహ్మదాబాద్ లో ₹1,54,900గా ఉంది. నిపుణుల అంచనా ప్రకారం, ద్రవ్యోల్బణం స్థిరపడుతూ, డాలర్ మరింత బలపడితే బంగారం ధరలు వచ్చే రోజుల్లో ఇంకా తగ్గే అవకాశం ఉంది.